T20 World Cup 2022: క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్‌కు త్వరలోనే తెరలేవనున్నది. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఇప్పటికే చాలా జట్లు ఆస్ట్రేలియాకు చేరాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకోండి. 

క్రికెట్ అభిమానులకు మళ్లీ పండుగ రోజులొచ్చాయి. ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 16 నుంచి నవంబర్ 13 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మేరకు దాదాపు అన్ని జట్లు ఇప్పటికే కంగారూల దేశం చేరుకున్నాయి. ఎనిమిదో ఎడిషన్ గా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో షెడ్యూల్, క్వాలిఫయింగ్ రౌండ్ లో ఉన్న జట్లు ఏవి..? ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు..? ఈ మ్యాచ్ లను లైవ్ ద్వారా వీక్షించడం ఎలా..? వంటి తదితర విషయాలన్నీ ఇక్కడ చూద్దాం. 

2007లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ ను ప్రతీ రెండేండ్లకోసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి ఈ టోర్నీని భారత్ నెగ్గింది. ఆ తర్వాత 2009 (పాకిస్తాన్), 2010 (2011 లో వన్డే ప్రపంచకప్ ఉండటం వల్ల ఒక ఏడాది ముందు నిర్వహించారు. ఈ ట్రోఫీని ఇంగ్లాండ్ నెగ్గింది), 2012 (వెస్టిండీస్), 2014 (శ్రీలంక), 2016 (వెస్టిండీస్), 2021 (ఆస్ట్రేలియా) లలో ఈ టోర్నీని నిర్వహించారు. తాజాగా జరుగబోయే ఎడిషన్ ఎమిమిదవది. 

16 జట్లు.. 45 మ్యాచ్‌లు.. ఏడు వేదికలు.. 

- టీ20 ప్రపంచకప్-2022 లో మొత్తంగా 16 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 8 జట్లు ఇప్పటికే అర్హత సాధించగా మరో 8 జట్లు అర్హత రౌండ్లలో పోటీ పడి అందులో 4 జట్లు సూపర్-12 కు క్వాలిఫై అవుతాయి.
-16 జట్లు కలిసి 45 మ్యాచ్ లు ఆడతాయి. 
- ఆస్ట్రేలియాలోని ఏడు వేదికలు (మెల్‌బోర్న్, అడిలైడ్, సిడ్నీ, గబ్బా, గీలాంగ్, హోబర్ట్, పెర్త్) ఈ మ్యాచ్ లకు ఆథిత్యమివ్వనున్నాయి. 

క్వాలిఫై రౌండ్ ఆడే జట్లు : 

గ్రూప్ - ఏ : నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూనైటైడ్ అరబ్ ఎమిరేట్స్ 
గ్రూప్-బి : ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే 
- రెండు గ్రూప్ లలో టాప్ -2 గా నిలిచిన జట్లు అర్హత సాధించి సూపర్ - 12 ఆడతాయి. 

సూపర్ -12 లో.. 

సూపర్-12లో జట్లను రెండుగా విడగొట్టారు.  గ్రూప్ - ఏ లో అఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉన్నాయి. పైన క్వాలిఫై అయిన నాలుగు జట్లు సూపర్-12లో కలుస్తాయి. 
- సూపర్-12లో రెండు గ్రూపుల నుంచి టాప్-4 జట్లు సెమీస్ చేరతాయి. సెమీస్ లో గెలిచిన రెండు జట్లు నవంబర్ 13న మెల్‌బోర్న్ లో ఫైనల్ లో తలపడతాయి. 

రిజర్వ్ డే.. 

టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ దశలో ఏదైనా మ్యాచ్ వర్షం వల్లో మరేదైనా కారణం వల్లో ఆగిపోతే రిజర్వ్ డే లేదు. కానీ సెమీస్, ఫైనల్స్ కు మాత్రం ఈ అవకాశముంది.

షెడ్యూల్ ఇదే.. 

అక్టోబర్ 16: శ్రీలంక-నమీబియా, యూఏఈ-నమీబియా
అక్టోబర్ 17: వెస్టిండీస్ - స్కాట్లాండ్, జింబాబ్వే - ఐర్లాండ్ 
అక్టోబర్ 18 : నమీబియా - నెదర్లాండ్స్, శ్రీలంక - యూఏఈ 
అక్టోబర్ 19 : స్కాట్లాండ్ - ఐర్లాండ్, వెస్టిండీస్ - జింబాబ్వే 
అక్టోబర్ 20 : శ్రీలంక - నెదర్లాండ్స్, నమీబియా - యూఏఈ 
అక్టోబర్ 21 : వెస్టిండీస్ - ఐర్లాండ్, స్కాట్లాండ్ - జింబాబ్వే 

Scroll to load tweet…

అక్టోబర్ 22 నుంచి సూపర్-12 రౌండ్ స్టార్ట్ అవుతుంది.  ఈ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. గతేడాది ఫైనల్స్ లో ఓడిన న్యూజిలాండ్ ను ఢీకొంటుంది. మరో మ్యాచ్ లో ఇంగ్లాండ్.. అఫ్ఘానిస్తాన్ తో తలపడబోతున్నది. 
అక్టోబర్ 23 : గ్రూప్ ఏ విజేత - గ్రూప్ బి విజేత , ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 
అక్టోబర్ 24 : బంగ్లాదేశ్ - గ్రూప్ ఏ రన్నరప్ , సౌతాఫ్రికా - గ్రూప్ బి విజేత 
అక్టోబర్ 25 : ఇంగ్లాండ్ - గ్రూప్ బి రన్నరప్ , ఆస్ట్రేలియా - గ్రూప్ ఏ విజేత 
అక్టోబర్ 26 : ఇంగ్లాండ్ - గ్రూప్ బి రన్నరప్ , న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గానిస్తాన్ 
అక్టోబర్ 27 : సౌతాఫ్రికా - బంగ్లాదేశ్, ఇండియా - గ్రూప్ ఏ రన్నరప్, పాకిస్తాన్ - గ్రూప్ బి విన్నర్
అక్టోబర్ 28 : అఫ్గానిస్తాన్ - గ్రూప్ బి రన్నరప్, ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా 
అక్టోబర్ 29 : న్యూజిలాండ్ - గ్రూప్ ఏ విన్నర్ 
అక్టోబర్ 30 : బంగ్లాదేశ్ - గ్రూప్ ఏ విన్నర్ , పాకిస్తాన్ - గ్రూప్ ఏ రన్నరప్, ఇండియా - సౌతాఫ్రికా 
అక్టోబర్ 31 : ఆస్ట్రేలియా - గ్రూప్ బి రన్నరప్ 

Scroll to load tweet…

నవంబర్ 1 : అఫ్గానిస్తాన్ - గ్రూప్ ఏ విజేత , ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ 
నవంబర్ 2 : గ్రూప్ బి విజేత - గ్రూప్ ఎ రన్నరప్ , ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ 
నవంబర్ 3 : పాకిస్తాన్ - సౌతాఫ్రికా 
నవంబర్ 4 : న్యూజిలాండ్ - గ్రూప్ బి రన్నరప్, ఆస్ట్రేలియా - అఫ్గానిస్తాన్ 
నవంబర్ 5 : ఇంగ్లాండ్ - గ్రూప్ ఎ విన్నర్ 
నవంబర్ 6: సౌతాఫ్రికా - గ్రూప్ ఏ రన్నరప్ , పాకిస్తాన్ - బంగ్లాదేశ్, ఇండియా - గ్రూప్ బి విజేత 

నవంబర్ 9 నుంచి తొలి సెమీస్ సిడ్నీ లో, నవంబర్ 10న రెండో సెమీస్ అడిలైడ్ లో జరుగుతాయి. ఇక తుది పోరు నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది. 

టీవీలో చూడటమెలా..? 

ఈ మెగా టోర్నీని భారత్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది. అంతేగాక డిస్నీ హాట్ స్టార్ లలో కూడా లైవ్ చూడొచ్చు.