Asianet News TeluguAsianet News Telugu

ఇటు ప్రభుత్వం, అటు ఐసీసీ... ప్రభుత్వ జోక్యంతో శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసిన ఐసీసీ...

లంక క్రికెట్ బోర్డు మొత్తాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న శ్రీలంక ప్రభుత్వం... బోర్డు వ్యవహరాాల్లో ప్రభుత్వ జోక్యంతో సస్పెన్షన్ వేటు వేసిన ఐసీసీ.. 

ICC Suspended Sri Lanka Cricket board after government sacking decision CRA
Author
First Published Nov 10, 2023, 8:56 PM IST

సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత  పూర్వ వైభవం అందుకోవడానికి తెగ తంటాలు పడుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకి దెబ్బ మీద దెబ్బ తగిలింది. భారత జట్టు చేతుల్లో 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది శ్రీలంక. ఈ ఓటమి తర్వాత రెండు రోజులకే లంక క్రికెట్ బోర్డు మొత్తాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది శ్రీలంక ప్రభుత్వం..

ఈ నిర్ణయంతో తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరోసారి షాక్ తగిలింది. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న లంక క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో బోర్డును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). 

నవంబర్ 10, శుక్రవారం సమావేశమైన ఐసీసీ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అదీకాకుండా లంక ప్రభుత్వం బోర్డు మొత్తాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇప్పటికే 9 మ్యాచులు ఆడేసిన లంక జట్టు, 2 విజయాలు, 8 పరాజయాలతో స్వదేశానికి పయనమైంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పోరాడి ఓడింది శ్రీలంక. శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేయడంతో ఈ సస్పెన్షన్ ఎత్తి వేసే వరకూ ఆ టీమ్‌ ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనలేదు..

Follow Us:
Download App:
  • android
  • ios