Asianet News TeluguAsianet News Telugu

ఆడినంత కాలం ఆర్‌సీబీకే ఆడాలనుకుంటున్నా... యజ్వేంద్ర చాహాల్ ఎమోషనల్ కామెంట్స్...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నా... యజ్వేంద్ర చాహాల్ కామెంట్స్... టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఆర్‌సీబీ స్పిన్నర్...

I want to retire with my current IPL Team RCB, Says Yuzvendra chahal
Author
India, First Published Sep 14, 2021, 3:55 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ ఆరంభానికి ముందు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు యజ్వేంద్ర చాహాల్. గత మూడేళ్లుగా భారత జట్టుకి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్‌కి, టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

2014 నుంచి ఆర్‌సీబీ జట్టులో కీ ప్లేయర్‌గా ఉంటున్న యజ్వేంద్ర చాహాల్... తన రిటైర్మెంట్ వరకూ అదే జట్టులో కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు... ‘యజ్వేంద్ర చాహాల్ అనే ఓ స్పిన్నర్ ఉన్నాడనే విషయం, ఆర్‌సీబీ ద్వారానే ప్రపంచానికి తెలిసింది. ఆర్‌సీబీలో పర్ఫామెన్స్ కారణంగానే నేను టీమిండియాలోకి వచ్చాను.

నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉండొచ్చు, కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడడం ఎప్పుడూ ఎంజాయ్ చేశాను. అందుకే నా కెరీర్‌ చివరివరకూ ఆర్‌సీబీలోనే ఉండాలని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...

ఈ ఏడాది ఆర్‌సీబీ తరుపున ఏడు మ్యాచులు ఆడిన యజ్వేంద్ర చాహాల్, నాలుగు వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 106 మ్యాచులు ఆడిన యజ్వేంద్ర చాహాల్, 125 వికెట్లు పడగొట్టాడు. యూఏఈలో జరిగిన 2020 సీజన్‌లో 15 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టిన చాహాల్, బౌలింగ్‌లో ఆర్‌సీబీ తరుపున సోలో పర్ఫామెన్స్ ఇచ్చాడు...  

Follow Us:
Download App:
  • android
  • ios