2011లో వరల్డ్ కప్ లో తనకు కూడా చోటు దక్కలేదు అని ఆయన గుర్తు చేశారు. చోటు దక్కకపోతే కలిగే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసని, అయితే, ఎవరికైనా చోటు దక్కలేదు అంటే కచ్చితంగా దానికి కారణం ఉంటుందని అన్నారు.
వరల్డ్ కప్ సమరం మొదలవ్వబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్ ఎలాగైనా సాధించాలని టీమిండియా చాలా పట్టుదలతో ఉంది. ఇక, ఈ వరల్డ్ కప్ కోసం పోటీపడే టీమ్ లోనూ ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి కూడా అందరిలోనూ ఎక్కువగా ఉంది. మరో వారం రోజుల్లో టీమ్ ని ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఈ క్రమంలో, తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. వరల్డ్ కప్ కి సంబంధించిన పలు విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రపంచకప్ లో అందరికీ చోటు దక్కకపోవచ్చని ఆయన అన్నారు. 2011లో వరల్డ్ కప్ లో తనకు కూడా చోటు దక్కలేదు అని ఆయన గుర్తు చేశారు. చోటు దక్కకపోతే కలిగే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసని, అయితే, ఎవరికైనా చోటు దక్కలేదు అంటే కచ్చితంగా దానికి కారణం ఉంటుందని అన్నారు.
2011 ప్రపంచకప్ జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో చాలా బాధపడ్డానని, ఆ సమయంలో యువరాజ్ సింగ్ తనకు అండగా నిలిచాడని, తనను ఓదార్చాడని చెప్పాడు. అప్పుడు తనను ఎంపిక చేయలేదని, ఓ గదిలో కూర్చొని బాగా ఏడ్చానని గుర్తు చేసుకున్నారు. అయితే, అప్పుడు యువరాజ్ సింగ్ తన గదికి పిలిచి, ఓదార్చి డిన్నర్ కి తీసుకువెళ్లాడని చెప్పారు. ‘నీకు ఇంకా వయసు ఉంది. ఈ సమయాన్ని నీ ఆట, నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగించు, ఆ తర్వాత తిరిగి మళ్లీ జట్టులోకి అడుగుపెట్టు’ అని ఆరోజు యూవీ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు.
ఇక, ప్రస్తుత జట్టు ఎంపిక విషయంపై కూడా ఆయన మాట్లాడారు. ‘ నేను, కోచ్, సెలక్టర్లు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటం. ప్రత్యర్థి, పిచ్, మా బలాలు, బలహీనతలు అన్ని పరిశీలించి ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్కోసారి మేం తీసుకునే నిర్ణయాలు తప్పు కావచ్చు. మనుషులన్నాక తప్పులు చేయడం సహజం కదా. ఇక, సెలక్ట్ కాని వారిని పర్సనల్ గా పిలిచి మాట్లాడతాం. వారిని సెలక్ట్ చేయకపోవడానికి గల కారణాలను వారికి వివరిస్తాం’ అని రోహిత్ శర్మ చెప్పారు.
