Asianet News TeluguAsianet News Telugu

ఓసారి మా మామను ఔట్ చేశా.. అప్పుడు ఆనందం మాటల్లో చెప్పలేను : షాహీన్ అఫ్రిది

పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ అఫ్రిది త్వరలోనే ఆ జట్టు మాజీ ఆల్ రౌండర్, ప్రస్తుతం పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ గా ఉన్న షాహీద్ అఫ్రిదికి అల్లుడు కాబోతున్నాడు. అఫ్రిది కూతురితో షాహీన్ ప్రేమలో ఉన్నాడు.

I Have Dismissed My Father in Law Once,  That was Great Feeling: Shaheen Afridi
Author
First Published Jan 4, 2023, 1:25 PM IST

పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది తన కెరీర్ లో ఎంతోమంది దిగ్గజ బ్యాటర్లను పెవిలియన్ కు పంపాడు.  2021 టీ20  ప్రపంచకప్ లో  రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా   షాహీన్ బౌలింగ్‌కు బాధితులే.  ఇక స్వదేశంలో అయితే షాహీన్  హవా మాములుగా ఉండదు.  ఆనతికాలంలోనే అందరి చేత ప్రశంసలు అందుకున్న  షాహీన్ అఫ్రిదికి.. ఇప్పటివరకు తన ఫేవరేట్ వికెట్ మాత్రం తనకు కాబోయే మామగారిదేనట. ఈ విషయాన్ని స్వయంగా అతడే చెప్పాడు. 

ఇటీవల పాకిస్తాన్ లో ఓ కార్యక్రమానికి హాజరైన షాహీన్ అఫ్రిది యువ క్రికెటర్లతో ముచ్చటించాడు. వారిలో  పలువురు.. ‘మీరు ఇప్పటివరకూ చాలా వికెట్లు తీశారు కదా. అందులో మీకు  ఫేవరేట్ వికెట్  ఏది..?’ అని ప్రశ్నించారు.  దానికి షాహీన్ స్పందిస్తూ.. ‘నేను ఒకసారి మా మామను ఔట్ చేశా. అది నా ఫేవరేట్ వికెట్..’ అని  అన్నాడు. 

షాహీన్ అఫ్రిది త్వరలోనే  పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్, ప్రస్తుతం పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ గా ఉన్న షాహీద్ అఫ్రిదికి అల్లుడు కాబోతున్నాడు. అఫ్రిది కూతురితో షాహీన్ ప్రేమలో ఉన్నాడు. ఈ ఇద్దరి పెళ్లిని  ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారు.  ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో వీళ్ల పెళ్లి బాజా మోగే అవకాశముంది. 

కాగా.. మామను ఔట్  చేయడంపై తన ఫీలింగ్ ఏంటని  షాహీన్ ను అడగ్గా దానికి అతడు స్పందిస్తూ.. ‘ఇది చాలా మంచి ఫీలింగ్.  చిన్నప్పట్నుంచి రోల్ మోడల్ గా ఉన్న  వ్యక్తి వికెట్ తీయడం ఎవరికైనా  కలలాంటిదే కదా..’అని  చెప్పుకొచ్చాడు. 

 

షాహీన్.. షాహీద్ అఫ్రిదిని పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో భాగంగా  ఓసారి ఔట్ చేశాడు.  లాహోర్ కలందర్స్ - కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ దీనికి వేదికైంది. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కరాచీ కింగ్స్ తరఫున ఆడిన షాహీద్ అఫ్రిది.. షాహీన్ విసిరిన బంతిని   భారీ సిక్సర్ గా మలిచాడు.  కానీ తర్వాత బంతికే షాహీన్.. మామను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios