Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: ఉన్నదెంత..? ఊడ్చిపెట్టిందెంత..? వేలానికి మిగిలేదెంత..? ఐపీఎల్ లో 8 జట్ల దగ్గర మిగిలిన డబ్బు ఇదే..

IPL Retention: రిటెన్షన్ పాలసీ ప్రకారం.. ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్  చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించిన విషయం తెలిసిందే.  కాగా.. 8 ఫ్రాంచైజీలు ఆయా ఆటగాళ్ల కోసం ఖర్చు పెట్టగా మిగిలిన మొత్తం ఇక్కడ చూద్దాం.

How Much Money In Franchisees Purse after IPL Retention announced, Here Is The Answer
Author
Hyderabad, First Published Dec 1, 2021, 3:46 PM IST

వచ్చే నెలలో జరుగబోయే ఐపీఎల్ వేలానికి ముందు ఆటగాళ్లను నిలుపుకునే ప్రక్రియ మంగళవారం రాత్రి ముగిసింది. ఏ ఏ ఆటగాళ్లు ఎవరితో ఉండనున్నారు..? ఫ్రాంచైజీలు ఎవర్ని వదులుకున్నాయి..?  అనేదానిమీద స్పష్టత వచ్చింది. 8 ఫ్రాంచైజీలు 27 మంది క్రికెటర్లను అట్టిపెట్టుకున్నాయి. పలు జట్లలో కీలక ఆటగాళ్లు దూరమైనా ఉన్న క్రికెటర్లకు కూడా ఆయా ఫ్రాంచైజీలు భారీగా డబ్బులు కుమ్మరించాయి. ఈ నేపథ్యంలో ఏ ఏ జట్లు.. ఎవరెవరి కోసం ఎంత ఖర్చు చేశాయి..? ఇంకా ఎంత అమౌంట్ మిగిలింది..? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. 

అంతకంటే  ముందుగా రిటెన్షన్ పాలసీ ప్రకారం.. ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్  చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నలుగురు ఆటగాళ్లను (ఒక విదేశీ, ముగ్గురు స్వదేశీ.. లేదంటే ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ) దక్కించుకోవడానికి వివిధ జట్లు భారీగానే ఖర్చుపెట్టాయి. 

నలుగురు ఆటగాళ్లను దక్కించుకున్న జట్లు.. మొదటి ఆటగాడి (తొలి ప్రాధాన్యం) రూ. 16 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 12 కోట్లు, మూడో ఆటగాడికి రూ. 8 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 6 కోట్లు చెల్లించాయి.  ఇక ముగ్గురిని దక్కించుకుంటే.. వరుసగా రూ. 15 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 7 కోట్లు ముట్టజెప్పాయి. ఇద్దర్ని తీసుకుంటే.. వరుసగా రూ. 14 కోట్లు, రూ. 10 కోట్లు గా ఇచ్చాయి. ఒక్కరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే రూ. 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.  అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఆటగాళ్లకు పైన నిర్దేశించిన చెల్లింపులే చేయాలని లేదు. ఆటగాళ్ల కొనుగోలుకు  ఒక్కో ఫ్రాంచైజీకి కేటాయించిన మొత్తం రూ. 90 కోట్లు. 

కాగా.. 8 ఫ్రాంచైజీలు ఆయా ఆటగాళ్ల కోసం ఖర్చు పెట్టగా మిగిలిన మొత్తం ఇక్కడ చూద్దాం. 

- చెన్నై సూపర్ కింగ్స్.. (నలుగురిని రిటైన్ చేసుకుంది. రైనా, ధోని, అలీ, రుతురాజ్ ల  కోసం రూ. 42 కోట్లు ఖర్చు చేసింది)  పర్స్ లో మిగిలింది రూ. 48 కోట్లు 
- ముంబయి ఇండియన్స్.. (నలుగురిని నిలుపుకుంది.. రోహిత్, బుమ్రా, సూర్యకుమార్, పొలార్డ్ ల కోసం రూ. 42 కోట్లు వెచ్చించింది.) పర్స్ లో రూ. 48 కోట్లున్నాయి. 
- కోల్కతా నైట్ రైడర్స్ .. (ఆండ్రూ రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్ లను రిటైన్ చేసుకుని రూ. 42 కోట్లు ఖర్చు పెట్టింది) మిగిలింది రూ. 48 కోట్లు
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. (విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, సిరాజ్ లకు రూ. 33 కోట్లు ఖర్చుపెట్టింది) మిగిలిన మొత్తం రూ. 57 కోట్లు 
- ఢిల్లీ క్యాపిటల్స్.. (రిషభ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా,  నార్త్జ్ ల కు రూ. 42.5 కోట్లు ఖర్చు పెట్టింది) మిగిలిన నగదు విలువ రూ. 47 కోట్లు 
- సన్ రైజర్స్ హైదరాబాద్.. (కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ లకురూ. 22 కోట్లు వెచ్చించింది) ఇంకా మిగిలిఉన్న మొత్తం రూ. 68 కోట్లు
- రాజస్థాన్ రాయల్స్.. (సంజూ శాంసన్, జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్ లను  రూ. 28 కోట్లకు దక్కించుకుంది) మిగిలున్న మొత్తం రూ. 62 కోట్లు
- పంజాబ్ సూపర్ కింగ్స్.. (మయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్ లను రూ. 16 కోట్లకు నిలుపుకుంది) మిగిలున్న మొత్తం రూ. 72 కోట్లు   

ఇప్పుడు పర్స్ లో మిగిలున్న మొత్తంలోనే మిగిలిన ప్లేయర్లను కొనుక్కోవాల్సి ఉంటుంది.   ఈ నెలాఖరులో గానీ, వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో గానీ ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న నేపథ్యంలో  దానికి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వేలానికి ముందు.. ఐపీఎల్ లో కొత్త జట్లైన  లక్నో, అహ్మదాబాద్ లు డిసెంబర్ 27 లోగా గరిష్టంగా ముగ్గురు క్రికెటర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వేలం జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios