Asianet News TeluguAsianet News Telugu

జిల్లా లెవెల్ క్రికెట్‌ కూడా ఆడని ప్లేయర్‌ని కొన్న ఆర్‌సీబీ... ఎవరీ హిమాన్షు శర్మ...

ఏ మాత్రం దేశవాళీ టోర్నీలు ఆడిన అనుభవం లేని హిమాన్షు శర్మను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ... క్లబ్ క్రికెట్ నుంచి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న యంగ్ స్పిన్నర్.. 

Himanshu Sharma Who didn't played even district level cricket, picked by RCB In IPL2023 Mini Auction
Author
First Published Dec 27, 2022, 12:18 PM IST

ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోవాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. దేశవాళీ టోర్నీల్లో అపారమైన అనుభవం, అద్భుతమైన రికార్డులు ఉన్న ప్లేయర్లు కూడా ఐపీఎల్‌లో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు. ప్రియమ్ గార్డ్, మహ్మద్ అజారుద్దీన్ వంటి ప్లేయర్లు.. వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరారు. అయితే ఏ రకమైన దేశవాళీ టోర్నీలు ఆడిన అనుభవం లేని కుర్రాడిని కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

ఐపీఎల్ 2023 మినీ వేలంలో రీస్ తోప్లే, విల్ జాక్స్‌లను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ, రజన్ కుమార్, అవినాష్ సింగ్, సోనూ యాదవ్, మనోజ్ బండగే, హిమన్షు శర్మలను జట్టులోకి తీసుకుంది. వీరిలో హిమాన్షు శర్మ, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు... 

సయ్యద్ ముస్తాక్ ఆలీ, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీతో పాటు తమిళనాడు టీ20 లీగుల్లో సత్తా చాటిన ప్లేయర్లను ఏరికోరి కొనుగోలు చేస్తాయి ఫ్రాంఛైజీలు... దేశవాళీ దుమ్ములేపి రికార్డులు తిరగరాసిన సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లకు ఐపీఎల్‌లో నిరాశే ఎదురవుతోంది. అయితే హిమాన్షు శర్మ ఇప్పటి దాకా ఏ రాష్ట్ర టీమ్‌కి కానీ జిల్లా టీమ్‌కి కానీ ఆడలేదు...

‘హిమాన్షు చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్న ప్లేయర్. దేశవాళీ టోర్నీల్లో అతను ఇంకా ఆడలేదు. ఆర్‌సీబీ టాలెంట్ స్కౌటింగ్ టీమ్, హిమాన్షుని వెతికి  వెలికి తీసింది. ఏడాది క్రితమే హిమాన్షుని చూశాం. అతన్ని గమనిస్తూ వస్తున్నాం. అందుకే అతను మా టీమ్‌లో ఉంటే బాగుంటుందని తీసుకున్నాం. 

ఆర్‌సీబీలో మంచి కోచ్‌లు ఉన్నారు. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నాం. వీరి నుంచి హిమాన్షు ఎంత నేర్చుకుంటాడు, ఎలా రాటుతేలడనేది అతని చేతుల్లోనే ఉంది. రాజస్థాన్‌ నుంచి వచ్చిన ఈ కుర్రాడు, ప్రస్తుతం క్లబ్ లెవెల్ క్రికెట్ ఆడుతున్నాం. ఇప్పటికే ఈ దేశవాళీ టోర్నీ ఆడకపోయినా తన టాలెంట్‌ని ఎలా వాడుకోవాలో ఆర్‌సీబీకి అవగాహన కుదిరింది.. అతన్ని మ్యాచ్ విన్నర్‌గా మలచడమే మా ముందున్న లక్ష్యం...’ అంటూ కామెంట్ చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కౌటింగ్ టీమ్ హెడ్ మలోనన్ రంగరాజన్..

‘నేను ఇప్పటిదాకా ఏ స్టేట్ టీమ్‌కి ఆడలేదు. ఏ కాంపీటీషన్‌లో పాల్గొనలేదు, కనీసం జిల్లా టీమ్‌కి కూడా ఆడలేదు. అలాంటి నన్ను ఆర్‌సీబీ సెలక్ట్ చేసుకుంది. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నా... విరాట్ కోహ్లీ నా క్రికెట్ ఐడెల్. ఆర్‌సీబీ క్యాంపులో ఆయన్ని కలవడానికి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నా...

మహ్మద్ సిరాజ్, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోబోతున్న.. అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. ఈ సంతోషంగా మాటల్లో చెప్పలేను... ’ అంటూ వ్యాఖ్యానించాడు హిమాన్షు శర్మ..  24 ఏళ్ల లెగ్ స్పిన్నర్ హిమాన్షు శర్మ, బంతిని రెండు వైపులా టర్న్ చేయగలడు. హిమాన్షు శర్మను బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ.. 

Follow Us:
Download App:
  • android
  • ios