క్రికెట్ నుంచి దొరికిన లాంగ్ బ్రేక్ లతో శిఖర్ ధావన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే శిఖర్ ధావన్ తాజాగా తన భార్య అయేషాతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. 

శిఖర్ వెనుక అయేషా నిల్చుని కెమెరాకు పోజ్ ఇస్తున్న ఫోటోను పోస్ట్ చేసి ప్రేమ అంటే ఒకరినొకరు చూడడం మాత్రమే కాదు, ఇద్దరు కలిసి ఒకే విధంగా చూడడం అనే ఒక ఫ్రెంచ్ కవి కొటేషన్ ను పోస్ట్ చేసాడు. 

ధావన్ ఈ పిక్చర్ షేర్ చేయగానే అభిమానులు తెగ లైకులు కొట్టేశారు. టీం సభ్యులు సైతం ఈ ఫొటోకు ఫన్నీ రెప్లైస్ ఇచ్చారు. నిన్న ఆదివారం ఈ ఫోటోను పోస్ట్ చేసే ముందే ధావన్ తన కొడుకు జొరవర్ సూపర్ హీరో డ్రెస్ లో చపాతీ కాలుస్తున్న వీడియోను షేర్ చేసాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Even Super Heroes can Cook 😜#Zoraver Cooking Chapati 😁😁

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on Jul 11, 2020 at 4:30am PDT

గత నెలలో ధావన్ తమ కుటుంబంలోకి మరో ఇద్దరు వ్యక్తులు చేరుతున్నారు అని ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసాడు. రెండు కుక్క పిల్లలను పరిచయం చేసాడు ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్. 

కొన్ని రోజుల కింద  ధావన్‌ షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ నెట్టింట వైరల్ గా మారింది.  ఈ ఇండియన్ ఓపెనర్ ఫన్నీ రంగురంగుల విగ్ ను ధరించిన ఫోటోను పోస్ట్ చేసాడు. ‘ఎట్టకేలకు కాస్త జుట్టు వచ్చింది’ అంటూ నెత్తి మీద విగ్గు లాంటి క్యాప్‌ పెట్టుకుని ఉన్న ధావన్‌ ఫొటోపై అభిమానులు కామెంట్ చేసారు. 

 ఇక ధావన్‌ నార్మల్‌ లుక్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే!.. కాగా  2010లో అరంగేట్రం చేసిన శిఖర్‌ ధావన్‌ ఇప్పటి వరకు 136 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు.  ఇటీవలే శిఖర్‌ ధావన్ పేరును బీసీసీఐ ‘అర్జున అవార్డు’ కోసం నామినేట్ చేసిన విషయం తెలిసిందే.