ఆసియాకప్-2023 మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. అయితే ఆసియాకప్ మ్యాచ్‌లపై వరుణుడు ప్రభావం చూపుతునే ఉన్నాడు.
ఆసియాకప్-2023 మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. అయితే ఆసియాకప్ మ్యాచ్‌లపై వరుణుడు ప్రభావం చూపుతునే ఉన్నాడు. సోమవారం జరిగిన భారత్, నేపాల్ మ్యాచ్‌కు కూడా వరుణుడు అంతరాయం కలిగించాడు. అయితే చివరకు ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియ్ సూపర్-4కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. అంపైర్‌ను హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో నేపాల్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పలుమార్లు వర్షం దోబుచులాడింది. మహ్మద్ సిరాజ్ 30వ ఓవర్ వేసిన తర్వాత తేలికపాటి చినుకులు కురిసాయి. కొద్దిసేపు ఆట ఆగిపోయింది. గ్రౌండ్ స్టాప్ పిచ్‌ను రక్షించడానికి కవర్‌లతో మైదానంలోకి దూసుకెళ్లారు. అయితే.. వారు పిచ్‌కు చేరుకోకముందే వర్షం తగ్గిపోయింది. దీంతో వారు వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. అప్పటికీ ఇంకా మైదానం వీడని భారత ఆటగాళ్లు మళ్లీ తమ స్థానాలను కొనసాగించారు.
ఆ తర్వాత రవీంద్ర జడేజా 35వ ఓవర్ వేయబోతున్న సమయంలో మళ్లీ చినుకులు కురిశాయి. నేపాల్ బ్యాటర్లు డగౌట్ వైపు వెళ్తున్నట్టుగా కనిపించినప్పటికీ.. భారత ఆటగాళ్లు గ్రౌండ్‌లో ఉన్నారు. అయితే అప్పుడు కూడా వర్షం దోబుచులాడింది.. దీంతో హార్దిక్ పగలబడి నవ్వాడు. అంపైర్‌ను కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, భారత్ సూపర్-4 దశలో సెప్టెంబర్ 10న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మరోసారి తలపడనుంది.
