Asianet News TeluguAsianet News Telugu

రికార్డులు చూడండి.. రూల్స్ కాదు: సెలక్టర్లపై హార్భజన్ విమర్శలు

ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం బీసీసీఐ ప్రకటించిన జట్టుపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హార్భజన్ సింగ్ తప్పుబట్టారు. ముఖ్యంగా యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై హర్భజన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు

Harbhajan Singh slams bcci selection committee over Suryakumar Yadav's Omission From Australia Tour
Author
Mumbai, First Published Oct 27, 2020, 6:53 PM IST

ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం బీసీసీఐ ప్రకటించిన జట్టుపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హార్భజన్ సింగ్ తప్పుబట్టారు. ముఖ్యంగా యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై హర్భజన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

ఇప్పటికే గాయాన్ని సాకుగా చూపి రోహిత్‌ శర్మను పక్కకు పెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సూర్యకుమార్‌ను పరిగణనలోకి తీసుకోలేకపోవడాన్ని భజ్జీ ఖండించాడు.‘

సూర్యకుమార్‌ ఇంకేమి నిరూపించుకోవాలో తెలియడం లేదు. అతన్ని టీమిండియా జట్టులో ఎంపికయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. సూర్యకుమార్‌ ప్రతీ ఐపీఎల్‌లో రంజీ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు.

మన సెలక్షన్‌ కమిటీలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన రూల్‌ను అవలంభిస్తున్నారు. ఇందుకు ఇదే నిదర్శనం.  సెలక్టర్లు.. కనీసం అతని రికార్డులను చూడండి. ఇది నా రిక్వెస్ట్‌’ అని భజ్జీ ట్వీట్ చేశాడు.

కాగా.. ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం టెస్టు, వన్డే, టీ20 జట్టులను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ  సోమవారం ఎంపిక చేసింది. మరోవైపు సీనియర్ స్పిన్నర్ ఇషాంత్‌ శర్మకు సైతం స్థానం కల్పించలేదు.

గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడమే ఇందుకు కారణం. ఇషాంత్‌ గాయాన్ని కూడా బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోంది. మరొకవైపు టెస్టు జట్టులో మాత్రమే రిషభ్‌ పంత్‌ అవకాశాన్ని ఇచ్చారు.

వన్డేలకు, టీ20లకు పంత్‌కు చోటు దక్కలేదు. టీమిండియా టెస్టు జట్టులో వృద్ధిమాన్‌ సాహాకు అవకాశం ఇచ్చారు. ఇక కేకేఆర్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పిన్నర్‌ వరుణ్‌ చక‍్రవర్తికి తొలిసారి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కింది. మహ్మద్‌ సిరాజ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు టెస్టు జట్టులో చోటు దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios