సిడ్నీ టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరు 96/2 పరుగుల వద్ద మూడో రోజు ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా 117 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 70 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన కెప్టెన్ అజింకా రహానే, ప్యాన్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత విహారి, పూజారా కలిసి నాలుగో వికెట్‌కి 25 పరుగులు జోడించారు. 38 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసిన హనుమ విహారి లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. 142 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా.

పూజారా మాత్రం క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. 100 బంతులదాకా ఒక్క బౌండరీ కూడా కొట్టని పూజారా, ఆ తర్వాత మూడు బౌండరీలు బాదాడు. 3 ఫోర్లతో 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు పూజారా.