కీలకమైన నాలుగో టెస్టుకి ముందు టీమిండియాకు చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టులో గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి బ్రిస్బేన్ టెస్టుకి దూరమయ్యారు. జడేజాకి ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించగా, హనుమ విహారి కోలుకునేందుకు అంతకంటే ఎక్కువే సమయం పడుతుందని సమాచారం.

దీంతో నాలుగో టెస్టుతో పాటు వచ్చే ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా వీళ్లు ఆడడం అనుమానంగానే మారింది. మరోవైపు మూడో టెస్టులో గాయపడిన బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లను కూడా స్కానింగ్ కోసం తరలించింది బీసీసీఐ.

బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ శరీరాన్ని టార్గెట్ చేస్తూ బంతులను వేసింది ఆసీస్. స్టార్క్ వేసిన ఓ బంతి, అశ్విన్‌కి బలంగా తగిలింది. దీంతో ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డాడు అశ్విన్. గాయాలతో బాధపడుతూనే వీరోచిత పోరాటం చేశారు.

అయితే అశ్విన్, బుమ్రా ఐదో టెస్టు ఆడే అవకాశం ఉందని సమాచారం. మొదటి టెస్టులో షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయపడి సిరీస్ నుంచి తప్పుకోగా మూడో టెస్టులో ఇద్దరు ప్లేయర్లు గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నారు.