Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్.. టీ20 జ‌ట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ! T20 World Cup మ‌న‌దే ఇక !

Virat Kohli - Rohit Sharma:  స్టార్ ప్లేయ‌ర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ భారత్ తరఫున టీ20లు ఆడేందుకు ఆసక్తి ఉన్నారు. వీరిద్దరూ చివరిసారిగా 2022 నవంబర్ 10న ఇంగ్లాండ్ తో టీ20 వరల్డ్ క‌ప్ సెమీఫైనల్ మ్యాచ్ లో ఆడారు. అయితే, రాబోయే టీ20 వ‌ర‌ల్ట్ క‌ప్ 2024 భార‌త జ‌ట్టులో ఉంటార‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
 

Good news for cricket lovers, Rohit Sharma, Virat Kohli named in India T20I squad, T20 World Cup 2024 RMA
Author
First Published Jan 5, 2024, 3:27 PM IST

T20 World Cup 2024: దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించిన భార‌త జ‌ట్టుకు గుడ్ న్యూస్. రాబోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 లో భార‌త స్టార్ క్రికెట‌ర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు ఆడ‌నున్నారు. సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ గెలిచి, టీ20, టెస్టు సిరీస్ ను డ్రాగా ముగించుకున్న త‌ర్వాత టీమిండియా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ ల‌ టీ20 సిరీస్ తో తలపడనుంది. రెండు ఆసియా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జనవరి 11న మొహాలీలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో రెండో మ్యాచ్ జనవరి 14న ఇండోర్ లో, చివరి మ్యాచ్ జనవరి 17న బెంగళూరులో జరుగుతాయి. ఆఫ్గానిస్థాన్ తో స్వ‌దేశంలో జరిగే సిరీస్ కోసం భారత సెలక్టర్లు త్వ‌ర‌లోనే జట్టును ప్రకటించనున్నారు. 

జట్టు ప్రకటనకు ముందు, బ్యాటింగ్ సూపర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ భారత్ తరఫున టీ20లు ఆడటానికి ఆసక్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 2022 నవంబర్ 10న అడిలైడ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 వరల్డ్ క‌ప్ 2022 రెండో సెమీఫైనల్లో మెన్ ఇన్ బ్లూ 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత వీరిద్దరూ భారత్ తరఫున ఒక్క టీ20 కూడా ఆడలేదు. అయితే 2024 టీ20 వరల్డ్ క‌ప్ ను దృష్టిలో ఉంచుకుని వీరిద్దరూ పునరాగమనానికి సిద్ధమయ్యారు. పొట్టి ఫార్మాట్లో ఎంపికకు తాము అందుబాటులో ఉన్నామని రోహిత్, కోహ్లీ బీసీసీఐకి తెలియజేశారు.

అయితే, ఈ స్టార్ ప్లేయ‌ర్ల‌ను అఫ్గానిస్తాన్ టీ20లకు  ఎంపిక చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది జూన్ లో వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 వరల్డ్ క‌ప్ 2024కు ముందు అఫ్గానిస్థాన్ తో స్వదేశంలో జరిగే చివరి ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఇదే. అఫ్గానిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ కు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ల‌కు భారత్ విశ్రాంతినిచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో బుమ్రా, సిరాజ్ రెచ్చిపోయారు. న్యూలాండ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ ఆరు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా  ఆరు వికెట్ల‌తో అద‌ర‌గొట్టాడు.

IND vs SA: చ‌రిత్ర సృష్టించిన భార‌త్.. 147 ఏండ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి

Follow Us:
Download App:
  • android
  • ios