బ్యాట్స్‌మెన్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి సెడ్జింగ్ చేయడంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల తర్వాతే ఎవ్వరైనా. అనుచిత వ్యాఖ్యలతో బ్యాట్స్‌మెన్‌ను డిస్టర్బ్ చేసే ఆసీస్ ప్లేయర్లు, భారత్ గత పర్యటనలో తగిలిన దెబ్బ తర్వాత పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తోంది. తిట్టడం, కోప్పడడం వంటివి చేస్తే భారత బ్యాట్స్‌మెన్ రెచ్చిపోతారని గ్రహించిన ఆసీస్, మరో మార్గాన్ని ఎంచుకుంది.

తాజాగా శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని ఏకాగ్రతను దెబ్బతీసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబుషేన్. ‘గిల్ నీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరు?’ అంటూ ప్రశ్నించాడు లబుషేన్. దానికి గిల్, మ్యాచ్ అయిపోయిన తర్వాత చెబుతానని సమాధానం ఇచ్చాడు.

అయినా ఆగని లబుషేన్... ‘సచిన్ టెండూల్కర్ లేదా విరాట్ కోహ్లీ... చెప్పు ఎవరో’ అంటూ ప్రశ్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో శుబ్‌మన్ గిల్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. వీటిని ఉద్దేశించే లబుషేన్ ఈ రకంగా గిల్‌ను క్వశ్చన్ చేశాడు.