భారతగడ్డపై ఈనెల 12 నుంచి ప్రారంభ‌మ‌య్యే మూడు వ‌న్డేల సిరీస్‌కు త‌మ జ‌ట్టును ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) తాజాగా ప్ర‌క‌టించింది. 15 మందితో కూడిన ఈ బృందానికి వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ క్వింట‌న్ డికాక్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే... ఈ జట్టులో జార్జ్ లిండేకి చోటు దక్కింది.

Also Read రిషబ్ పంత్ ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తారు: విరాట్ కోహ్లీ...

సోమవారం ప్రకటించిన జట్టు జాబితాలో జార్జ్ లిండే పేరు కూడా ఉండటం గమనార్హం. భార‌త ప‌ర్య‌ట‌న‌కు చైనామ‌న్ స్పిన్న‌ర్ త‌బ్రీజ్ ష‌మ్సీ దూరమయ్యాడు. త‌న భార్య ప్ర‌సవం కార‌ణంగా ఈ టూర్ నుంచి అతడు త‌ప్పుకున్నాడు. ష‌మ్సీ స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ జార్జ్ లిండేకు అవకాశం ఇచ్చారు. ఇక గాయం కార‌ణంగా స్టార్ పేస‌ర్ క‌గిసో రబాడ దూర‌మైన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉండగా... భారత్‌తో వన్డే సిరీస్ ద్వారా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పునరాగ‌మ‌నం చేస్తున్నాడు. జన్నెమాన్ మ‌లాన్ స్థానంలో డుప్లెసిస్‌ను సీఎస్ఏ ఎంపిక చేసింది. గ‌త‌డేది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ తర్వాత డుప్లెసిస్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే. అయితే ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో డుప్లెసిస్‌కు చోటు ద‌క్క‌లేదు. ఇటీవ‌లే ద‌క్షిణాఫ్రికా జట్టు కెప్టెన్సీనికి డుప్లెసిస్ రాజీనామా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు:

క్వింట‌న్ డికాక్ (కెప్టెన్‌), టెంబా బ‌వుమా, ర‌స్సీ వాన్ డ‌ర్ డ‌స్సెన్‌, డుప్లెసిస్‌, కైలీ వెర్రేన్‌, హెన్రిచ్ క్లాసెన్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, జాన్ స్మ‌ట్స్‌, అండైల్ ఫెహ్లుక్వాయో, లుంగీ ఎంగిడి, లుతో సిప్లామా, బ్యూర‌న్ హెండ్రిక్స్‌, ఆన్రిచ్ నోర్జ్‌, జార్జ్ లిండే, కేశ‌వ్ మ‌హారాజ్‌.