టీఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత కాసేపటికి విడుదల చేశారు. తనుండే ఏరియాలో రాష్ డ్రైవింగ్ తో పాటు, నివాసితులతో గొడవే దీనికి కారణం.
ముంబై : భారత మాజీ క్రికెటర్ Vinod Kambliని ఆదివారం మధ్యాహ్నం ముంబై పోలీసులు arrest చేశారు. ముంబై బాంద్రాలోని తమ Residential Society Gate ను కాంబ్లీ కారుతో ఢీ కొట్టి దూసుకెళ్లాడు. దీనిమీద ఫిర్యాదు అందడంతో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. సంఘటన తర్వాత సొసైటీ లోని వాళ్లకు, కాంబ్లీకి మధ్య Conflict జరిగింది. కాంప్లెక్స్‌లోని వాచ్‌మెన్‌తో పాటు.. కొంతమంది నివాసితులతో వాగ్వాదానికి దిగడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ తరువాత కొద్ది గంటలకు కాంబ్లీ Bailపై విడుదలయ్యారని ఆయన చెప్పారు.
వినోద్ కాంబ్లీపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం), 427 (నష్టం కలిగించే అల్లర్లు) కింద అభియోగాలు మోపామని బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కాంబ్లీ కారు ప్రమాదవశాత్తు అలా తాకిందా? లేదంటే రాష్ డ్రైవింగ్ చేశాడా? అనేది తెలియదు. కానీ గొడవ పెట్టుకోవడంతో అరెస్ట్ వరకు వెళ్లిందనేది తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 11న టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ సైబర్ మోసానికి గురయ్యాడు. సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన కాంబ్లీ.. లక్ష పదిహేను వేల రూపాయలు పోగొట్టుకున్నారు. బ్యాంకు అధికారినని పరిచయం చేసుకున్న సదరు మోసగాడు.. కాంబ్లీని బురిడీ కొట్టించి అతడి బ్యాంకు నుంచి డబ్బు మాయం చేశారు. అయితే సమయానికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాంబ్లీకి పెద్ద ముప్పు తప్పింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాంద్రాలో ఉంటున్న కాంబ్లీకి ఓ వ్యక్తి కాల్ చేశాడు. తాను బ్యాంక్ అధికారినని, కేవైసీ వివరాలు అప్ డేట్ చేయాలని, లేకుంటే అతడి డెబటిబ్, క్రెడిల్ కార్డు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పాడు. దీంతో అది నమ్మిన కాంబ్లీ అతడు చెప్పినట్లు చేశారు. తన ఫోన్ లో గూగుల్ యాప్స్ నుంచి ‘ఎనీ డెస్క్’ యాప్ డైన్ లోడ్ చేసుకున్నాడు.
అంతే.. ఆ తరువాత కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ.1.14లక్షల డబ్బు స్వాహా అయ్యింది. ఇది మరో అకౌంట్ కు బదిలీ అయ్యింది. సదరు నేరగాడు.. ఎనీ డెస్క్ ద్వారా కాంబ్లీ ఫోన్ ను ఆపరేట్ చేస్తూ.. అతడి బ్యాంక్ లో ఉన్న సొమ్మును కాజేశాడు. ఇదంతా కాంబ్లీ ఫోన్ లో మాట్లాడుతుండగానే జరుగడం ఆశ్చర్యం.
ఫోన్ మాట్లాడి పెట్టేసిన తరువాత కాంబ్లీ. తనకు వచ్చిన మెసేజ్ లను చూసుకుని అసలు విషయం అర్థం చేసుకన్నాడు. వివిధ ఖాతాల నుంచి సొమ్ము ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ కావడంతో అతడు దగ్గర్లోనే ఉన్న బాంద్రా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. దీని మీద ఫిర్యాదు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు, రివర్స్ ట్రాన్సాక్షన్ ద్వారా తిరిగి ఆయన డబ్బులు ఆయన ఖాతాలోకి జమచేయడంతో కాంబ్లీ ఊపిరి పీల్చుకున్నాడు.
