మరో మూడు రోజుల్లో ఐపీఎల్ మహా సమరం మొదలుకాబోతోంది. ఈ సారి ఏ జట్టు ఎలా ఆడుతుందో అని ఇప్పటికే అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. అయితే గ్రూప్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టిక ఇలా ఉంటుందని అంచనా వేస్తూ, ప్రీడిక్షన్ టేబుల్ విడుదల చేశాడు కివీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్.

స్టైరిస్ లెక్క ప్రకారం యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ టాప్‌లో ఉండబోతోంది. తర్వాతి స్థానంలో ముంబై ఇండియన్స్, మూడో స్థానంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నాలుగో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంటాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్... వరుసగా 5,6,7,8 స్థానాల్లో ఉంటాయి.

అంటే ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నై ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తాయని స్టైరిస్ అంచనా. దీనిపై రాజస్థాన్ స్పందించింది. ‘జస్ట్ క్యాజువల్లీ ట్వీట్‌ని సేవ్ చేస్తున్నాం’ అంటూ కామెంట్ చేసింది.

దీనిపై స్పందించిన స్టైరిస్... ‘లవ్ ఇట్.. నా అంచనా తప్పని నిరూపిస్తే నేను సంతోషిస్తా. కానీ మా ఇష్ ‘రితిందర్’ సోదీ మీకు సాయం చేస్తాడు... మీకు ఒంటరిగా మద్ధతు ఇస్తాడు.’ అంటూ ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్ సౌధీ... రాజస్థాన్‌కు స్పిన్ కోచ్ కన్సెల్టెంట్‌గా వ్యవహారిస్తున్నాడు.