మధ్యలో గుంపులో నుంచి ఓ అభిమాని సెల్ఫీ అని అడిగాడు. వెంటనే ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా, అతనిని పిలిచి సెల్ఫీ ఇచ్చాడు.
స్టార్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అత్యంత ప్రియమైన క్రీడాకారులలో ఒకరుగా చెప్పొచ్చు. కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లైవ్ లో ఆయనను ఒక్కసారి చూసినా చాలు అని కోరుకునేవారు కూడా ఉన్నారు. ఇక కోహ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు అంటే పరుగుల వరద పారిస్తాడు. ఇప్పటికే ఆయన ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం కోహ్లీ ఆసియా కప్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు.
తాజాగా కోహ్లీ వ్యక్తిత్వాన్ని తెలియజేసే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల గా మారింది. ఆ వీడియో ప్రకారం ఆయన ఎక్కడికో వెళ్తుంటే, మీడియా వాళ్లు ఫోటోలు తీస్తున్నారు. మధ్యలో గుంపులో నుంచి ఓ అభిమాని సెల్ఫీ అని అడిగాడు. వెంటనే ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా, అతనిని పిలిచి సెల్ఫీ ఇచ్చాడు.

చాలా మంది సెలబ్రెటీలు ఇలా ఫోటోలు ఇవ్వడానికి కూడా అంగీకరించరు. కానీ, కోహ్లీ మాత్రం వెంటనే అభిమానిని పిలిచి, అతనితో ఫోటో దిగాడు. దీంతో, ఈ వీడియోని ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, కోహ్లీపై ఇటీవల టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ లేకపోతే భారత్‌కి నష్టమేనని తేల్చిచెప్పాడు.
సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీకి ఉన్న అనుభవం, నైపుణ్యం, ఒత్తిడిలో రాణించగల సామర్థ్యం కారణంగా 2024 ప్రపంచ టీ20 జట్టులో అతను లేకపోతే బీసీసీఐ తప్పు చేసినట్లే. విరాట్ ఖచ్చితంగా టీ20 జట్టులో ఉండాలి, కోహ్లీ లేని భారత జట్టు గురించి ఆలోచించలేం. గత టీ20 ప్రపంచకప్‌లో అతను ఎలా రాణించాడో గుర్తుందా..? పాకిస్తాన్ లాంటి జట్టులతో ఆడేటప్పుడు భావోద్వేగాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కొన్నిసార్లు తలెత్తుతాయి. ఫలితంగా చిన్న పొరపాటుకు కూడా భారీ జరిమానాకు దారి తీస్తుంది. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో అలాంటి పరిస్థితి రావచ్చు. ఆ సమయంలో క్రీజులో విరాట్ లాంటి అనుభవజ్ఞుడైన మ్యాచ్ విన్నర్ కావాలి, అలాంటివారు లేకపోతే కష్టమే’ అని బంగర్ అన్నాడు.
