వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంగ్లాండ్ ప్రకటించిన జట్టులో బెన్ స్టోక్స్‌కి చోటు... యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత వన్డేల్లో కమ్‌బ్యాక్ ఇచ్చే ఆలోచన లేదన్న బెన్ స్టోక్స్..
‘ఛత్రపతి’ సినిమాలో ‘నిన్న మీరే కదండీ... వెళ్లమన్నారు’ అని బుడ్డోడు అడిగితే, ‘అది నిన్నరా...’ అని విలన్ చెప్పే డైలాగ్... సోషల్ మీడియాలో చాలా బాగా పేలింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌కి కూడా ఇది కరెక్ట్‌గా సెట్ అవుద్ది. యాషెస్ సిరీస్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత వన్డే రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని, వరల్డ్ కప్ ఆడే ఆలోచన ఉందా? అనే ప్రశ్న ఎదురైంది బెన్ స్టోక్స్‌కి...
అప్పుడు బెన్ స్టోక్స్, ‘నేను వన్డేల నుంచి రిటైర్ అయ్యాను. మళ్లీ యూ టర్న్ తీసుకునే ఆలోచన లేదు. యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత నేను హాలీడేకి వెళ్తున్నా. ఇప్పటికైతే ఆ విషయం గురించే ఆలోచిస్తున్నా..’ అంటూ కామెంట్ చేశాడు.. అయితే తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంగ్లాండ్ ప్రకటించిన జట్టులో బెన్ స్టోక్స్‌కి చోటు దక్కింది.
వన్డే రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే ఆలోచన లేదన్న బెన్ స్టోక్స్, అధికారికంగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడబోతున్నట్టు కన్ఫార్మ్ అయిపోయింది..
ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో 2019 వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన ఇంగ్లాండ్, జోస్ బట్లర్ కెప్టెన్సీలో 2023 వన్డే వరల్డ్ కప్ ఆడనుంది. ఇప్పటికే కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టైటిల్ గెలిచిన జోస్ బట్లర్‌కి, ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీ అసలు సిసలు పరీక్ష కానుంది..
తన కెరీర్‌లో 105 వన్డేలు ఆడిన బెన్ స్టోక్స్, 38.98 యావరేజ్‌తో 2924 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 74 వికెట్లు తీశాడు. బెన్ స్టోక్స్ రీఎంట్రీతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా మారింది ఇంగ్లాండ్ జట్టు..
వెస్టిండీస్, ఆస్ట్రేలియా తప్ప మిగిలిన ఏ జట్లూ, వన్డే వరల్డ్ కప్ టోర్నీని వరుసగా రెండు సార్లు గెలవలేకపోయాయి. 2019 వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లాండ్, ఈసారి కూడా అదే మ్యాజిక్‌ని రిపీట్ చేయగలిగితే ఈ రెండు టీమ్స్ సరసన చేరుతుంది..
జూలై 19, 2022న సౌతాఫ్రికాతో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడిన బెన్ స్టోక్స్, ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. టీ20ల్లోనూ ఆడుతున్నాడు. ఆగస్టు 30 నుంచి న్యూజిలాండ్‌తో నాలుగు టీ20, ఆ తర్వాత నాలుగు వన్డే మ్యాచుల సిరీస్‌లు ఆడనుంది ఇంగ్లాండ్.
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి ఇంగ్లాండ్ ప్రాథమిక జట్టు ఇది: జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జో రూట్, జాసన్ రాయ్, మొయిన్ ఆలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ కుర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, గుస్ అక్నిన్సన్
న్యూజిలాండ్‌తో ఆడబోయే నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌కి కూడా జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ జట్టు. ఈ టీ20 సిరీస్‌లో గుస్ అక్నిన్సన్, జోష్ టంగ్, జాన్ టర్నర్ వంటి కుర్రాళ్లకు చోటు దక్కింది.
టీ20 సిరీస్‌కి ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహ్మాన్ అహ్మద్, మొయిన్ ఆలీ, గుస్ అక్నిన్సన్, జానీ బెయిర్‌స్టో, హారీ బ్రూక్, సామ్ కుర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, బెన్ డక్లెట్, జోష్ ఇంగ్లీష్, జోష్ టంగ్, లూక్ వుడ్, విల్ జాక్స్
