డిల్లీ డేర్‌డెవిల్స్ పేరు కాస్తా డిల్లీ క్యాపిటల్స్ గా మారగానే ఆ జట్టు ఫేట్ కూడా మారినట్లుంది. పేట్ అనేబదులు ఆటగాళ్ల  ప్రదర్శన మారిందనాలి. 2008లో ఇండియర్ ప్రీమియర్ ప్రారంభమైన 2008 నుండి జరిగిన 11 సీజన్లలో ఎప్పుడూ సాధించిన మైలురాయికి డిల్లీ చేరుకుంది. ఇలా ఆ జట్టు సీజన్ 12 లో డిల్లీ అభిమానులనే కాదు ఐపిఎల్ అభిమానులందరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. 

ఐపిఎల్ సీజన్ 12లో భాగంగా ఇప్పటివరకు జరిగిన లీగ్ మ్యాచుల్లో డిల్లీ అద్భుతమైన ఆటతీరును కనబర్చింది. ఇలా మొత్తం 11 మ్యాచులాడిన ఆ జట్టు 7 విజయాలను అందుకుని 14 పాయింట్లు సాధించి పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచింది. ఇలా గతంలో ఎప్పుడుకూడా పాయింట్స్ టేబుల్ లో డిల్లీ పేరు అగ్రస్థానంలో నిలిచిన సందర్భాలు లేవు. తాజాగా ఈ సీజన్లో ఆ ఘనతను డిల్లీ క్యాపిటల్స్ సాధించింది. 

సోమవారం జైపూర్ లో సవాయ్ మాన్ సింగ్ స్టేడియయంలో రాజస్తాన్ జట్టును ఓడించడం ద్వారా డిల్లీ ఈ ఘనతను సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా చేధించి అగ్రస్థానానికి తాము అర్హులమేనని డిల్లీ చాటిచెప్పింది. ఈ ఘనత సాధించడంలో మొదటినుండి జట్టుకు ఓపెనర్లు పృథ్విషా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ లు సహకరించగా రాజస్థాన్ మ్యాచ్ లోనూ వారే డిల్లీని విజయతీరాలకు చేర్చారు.