ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ 2019లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసి విజయం సాధించింది. వాట్సన్‌ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రైనా (16 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఎమ్మెస్‌ ధోని (35 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జాదవ్‌ (34 బంతుల్లో 27; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి విజయాన్ని అందుకున్నారు..

సొంత మైదానంలో చెన్నైతో జరిగిన మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ బ్యాట్ మెన్స్ రాణించలేకపోయారు. మొదటి మ్యాచ్ లో చెలరేేగిన రిషబ్ పంత్ తో పాటు బ్యాట్ మెన్స్ అందరూ ఆకట్టుకోలేకపోవడంతో డిల్లీ 147 పరుగులకే పరిమితమయ్యింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక్కరే హాఫ్ సెంచరీతో పరవాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు పడగొట్టి డిల్లీని తక్కువ పరుగులకే కట్టడి చేయడంతో ముఖ్య పాత్ర పోషించాడు. 

డిల్లీ బ్యాట్ మెన్స్ చెన్నై బౌలర్ల దాటిికి తట్టుకోలేక పెవిలియన్ బాట పట్టారు. 120 పరుగుల వద్ద కేవలం రెండే వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో వున్న డిల్లీ 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంత్ తర్వాత ఇంగ్రామ్, పాల్, అక్షర్ పటేల్ లు వెంటవెంటనే ఔటయ్యారు. 

మొదటి మ్యాచ్ లో ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న డిల్లీ బ్యాట్ మెన్ రిషబ్ పంత్ ఆటలు చెన్నై ముందు సాగలేవు. 13 బంతుల్లోనే 25 పరుగులు చేసి మంచి జోష్ మీదున్నట్లు కనిపించిన పంత్ చివరకు బ్రావో బౌలింగ్ లో ఔటయ్యాడు. 

డిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెప్ శ్రేయాస్ అయ్యర్ మరోసారి పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. కేవలం 18 పరుగులు 20 బంతుల్లో చేసిన శ్రేయాస్ తాహిర్ బౌలింగ్ లో ఎల్బీగా వికెట్ల ముందు దొరికిపోయాడు. 

దాటిగా బ్యాటింగ్ ఆరంభించిన డిల్లీ ఓపెనర్ పృథ్విషా 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. చహర్ బౌలింగ్ లో వాట్సన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 

ఐపిఎల్ 2019 ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్, డిల్లి క్యాపిటల్స్ జట్లు విజయాలతో బోణీకొట్టి మంచి ఊపుమీదున్నాయి. ఇలా ఆడిన చెరో మ్యాచ్ లో విజయాన్ని అందుకున్న ఈ రెండు జట్టు డిల్లీ వేదికగా తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ క్రమంలో మరికొద్దిసేపట్లో ఆరంభం కానున్న మ్యాచ్ లో డిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరంభ మ్యాచులో ఆర్సిబిని ఓడించిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. అయితే డిల్లీ మాత్రం టెంట్ బౌల్ట్ స్థానంలో అమిత్ మిశ్రాను తుది జట్టులోకి తీసుకుంది. 

డిల్లీ జట్టు:

శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వి షా, కొలిన్ ఇంగ్రామ్, రిషబ్ పంత్, కీమో పాల్, అక్షర్ పటేల్, రాహుల్ తివారి, రబాడా, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ
 
చెన్నై జట్టు:

ఎంఎస్ ధోని, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేష్ రైనా, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహల్, షార్దూల్ ఠాకుర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్