బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్... డేవిడ్ మలాన్ అజేయ సెంచరీ... ఆరేళ్ల తర్వాత స్వదేశంలో తొలి వన్డే ఓడిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్ క్రికెట్‌లో వీక్ టీమే కానీ స్వదేశంలో కాదు. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా, టీమిండియా కూడా సిరీస్‌లు గెలవలేకపోయాడు. టీమిండియాపై 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌ని కూడా వణికించింది. తొలి వన్డేలో డేవిడ్ మలాన్ అద్భుత సెంచరీతో 3 వికెట్ల తేడాతో గెలిచి గట్టెక్కింది ఇంగ్లాండ్ జట్టు...
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 47.2 ఓవర్లలో 209 పరుగులకి ఆలౌట్ అయ్యింది. లిటన్ దాస్ 7, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 32 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసి అవుట్ కాగా షాంటో 82 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. ముస్తాఫికర్ రహీమ్ 16, షకీబ్ అల్ హసన్ 8 పరుగులు చేయగా మహ్మదుల్లా 48 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేశాడు...
అఫిఫ్ హుస్సేన్ 9, మెహెడీ హసన్ మిరాజ్ 7, టస్కిన్ అహ్మద్ 14, తైజుల్ ఇస్లాం 10 పరుగులు చేయగా ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 26 పరుగులు బంగ్లాదేశ్ ఖాతాలో చేరాయి. 13 వైడ్ బాల్స్ వేసిన ఇంగ్లాండ్ బౌలర్లు 4 నో బాల్స్ ఇచ్చారు..
210 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌కి శుభారంభం దక్కలేదు. జాసన్ రాయ్ 4, ఫిలిఫ్ సాల్ట్ 12 పరుగులు, జేమ్స్ వీన్స్ 6, జోస్ బట్లర్ 9 పరుగులు చేసి అవుట్ కావడంతో 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్...
విల్ జాక్స్ 31 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేయగా మొయిన్ ఆలీ 14, క్రిస్ వోక్స్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో డేవిడ్ మలాన్ తన స్టైల్‌లో పరుగుల వరద పారించాడు..
145 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు మాజీ ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్... 17 పరుగులు చేసిన అదిల్ రషీద్‌తో 8వ వికెట్‌కి 51 పరుగులు జోడించిన డేవిడ్ మలాన్, వన్డేల్లో 4వ సెంచరీ నమోదు చేశాడు... 16వ వన్డే ఆడుతున్న మలాన్, నాలుగు సెంచరీలు బాదేయడం విశేషం.
స్వదేశంలో వన్డే సిరీస్‌లో తొలి వన్డే ఓడడం బంగ్లాదేశ్‌కి గత ఆరేళ్లలో ఇదే తొలిసారి. ఇంతకుముందు 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో ఓడిన బంగ్లాదేశ్, మళ్లీ 2023లో ఇంగ్లాండ్‌పైనే తొలి వన్డే ఓడింది..
