కరోనా దెబ్బకు ఆటకు విరామం పడడంతో క్రికెటర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. తమ తమ అభిమానులతో ముచ్చటిస్తూ, వారితో తమ అనుభవాలను పంచుకోవడమే కాకుండా వారికి ఆనందాన్ని పంచుతూ, తాము కూడా ఆనందాన్ని పొందుతున్నారు. 

అందరి క్రికెటర్ల కన్నా అభిమానులకు అత్యధిక ఆనందం ఆపంచుతుంది మాత్రం నిస్సంకోచంగా డేవిడ్ వార్నేరే! టిక్ టాక్ లో ఏ ముహూర్తాన సైన్ అప్ అయ్యాడో కానీ అప్పటి నుండి అభిమానులకు పండగే పండగ. డ్యాన్సుల నుంచి మొదలు బాహుబలి గెట్ అప్ వరకు ఒక్కటేమిటి అనేక రకాలుగా అభిమానులకు వినోదాన్ని పంచిపెడుతున్నాడు. 

తాజాగా వార్నర్ అక్షయ్ కుమార్ బాల సినిమాలోని పాటకు డాన్స్ చేసాడు. సస్టెప్పులతో ఇరగదీయడమే కాకుండా డిఫరెంట్ గా 5 ఫ్రేముల్లో దర్శనమిచ్చాడు వార్నర్. ఇలా టిక్ టాక్ లో పోస్ట్ చేసిన తరువాత దాన్ని ఇంస్టాగ్రామ్ లో కూడా షేర్ చేసాడు వార్నర్. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I think I’ve got you covered @akshaykumar #bala #fun #friday #challenge 😂😂😂 Friday nights 👌👌

A post shared by David Warner (@davidwarner31) on May 22, 2020 at 3:59am PDT

వార్నర్ డాన్స్ కి ఫిదా అయినా టీమిండియా కెప్టెన్ కోహ్లీ లాఫింగ్ ఎమోజిలను పంపాడు. దానికి వార్నర్ రిప్లై ఇస్తూ.... నువ్వు నీభార్యతో కలిసి ఒక డ్యూయెట్ కి స్టెప్పులేయొచ్చు కదా, కావాలంటే.. నీ భార్య నీకొక అకౌంట్ ఓపెన్క్ హేసి ఇస్తుంది అని అన్నాడు.