ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరెంజ్ ఆర్మీకి 2013 నుంచి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న డేవిడ్ వార్నర్‌ను తప్పించి, కేన్ విలియంసన్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 

2013 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్ 2016 సీజన్‌లో జట్టును టైటిల్ ఛాంపియన్‌గా నిలిపాడు. గత సీజన్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, 8 సీజన్లలో ఆరుసార్లు ఫ్లేఆఫ్స్‌కి అర్హత సాధించడం విశేషం.

గత మ్యాచ్‌లో స్లో బ్యాటింగ్ కారణంగా విమర్శలు ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్‌ను, అంతకుముందు పవర్ ప్లేలో బెయిర్ స్టోను పక్కనబెట్టి తానే స్వయంగా బ్యాటింగ్ రావడం వల్ల ట్రోలింగ్‌కి గురయ్యాడు. రెండు మ్యాచుల్లో ప్రదర్శన ఆధారంగా వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి కలిగించింది.