Asianet News TeluguAsianet News Telugu

సౌతాఫ్రికా క్రికెట్‌లో మరో చిచ్చు... ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాలేదని కెప్టెన్‌నే తప్పించిన సెలక్టర్లు...

టీ20 వరల్డ్ కప్‌ 2023 టోర్నీ నుంచి ఉమెన్స్ టీమ్ కెప్టెన్ డేన్ వాన్ నీరెక్‌ని తప్పించిన సెలక్టర్లు... ఫిట్‌‌నెస్ టెస్టులో పాస్ కాకపోవడం వల్లే తప్పించినంటు ప్రకటన... రాజీనామాకి సిద్ధమవుతున్న సఫారీ ప్లేయర్లు?

Dane van Niekerk was left out of their squad for the T20 World Cup, creates controversies CRA
Author
First Published Feb 1, 2023, 4:28 PM IST

క్రికెట్‌లో ఫిట్‌నెస్ ముఖ్యమే, అయితే ఫిట్‌నెస్ ముఖ్యమా! స్కిల్స్ ముఖ్యమా... అంటే చాలామంది స్కిల్స్‌కే ఓటేస్తారు. అందుకే భారీ ఖాయం ఉన్న ఇంజమామ్ వుల్ హక్, మహ్మద్ షాజాద్, రహ్కీం కార్న్‌వాల్ వంటి ప్లేయర్లు, క్రికెట్‌లో రాణించగలిగారు...

అయితే టీ20 ఫార్మాట్ క్రేజ్ పెరిగిన తర్వాత క్రికెట్‌లో ఫిట్‌నెస్ ప్రాధాన్యం విపరీతంగా పెరిగిపోయింది. జాతీయ జట్టు తరుపున ఆడాలంటే ఫిట్‌నెస్ పరీక్షలు పాస్ కావాలనే రూల్ వచ్చింది. దేశవాళీ టోర్నీల్లో రికార్డుల దుమ్ము దులుపుతున్నా సర్ఫరాజ్ ఖాన్‌ని, టీమిండియా సెలక్టర్లు పట్టించుకోకపోవడానికి అతని ఫిట్‌నెసే కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి...

తాజాగా ఇదే ఫిట్‌నెస్, సౌతాఫ్రికా క్రికెట్‌లో చిచ్చు రేపింది. తాజాగా ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. అయితే ఈ జట్టుకి ఎంపిక చేసిన ప్లేయర్ల లిస్టులో ఆల్‌రౌండర్, సౌతాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ డేన్ వాన్ నీరెక్‌ పేరు లేకపోవడం అందరికీ షాక్‌కి గురి చేసింది..

క్రికెట్ సౌతాఫ్రికా తీసుకొచ్చిన కొత్త ఫిట్‌నెస్ స్టాండర్డ్స్ ప్రకారం మహిళా టీమ్‌కి సెలక్ట్ కావాలంటే ప్లేయర్లు, కచ్ఛితంగా 9.3 నిమిషాల్లో 2 కి.మీ.ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో సఫారీ కెప్టెన్ డేన్ వాన్ నీరెక్, మరో 15 సెకన్లు ఎక్కువగా తీసుకోవడంతో ఆమెను టీ20 వరల్డ్ కప్‌ 2023 టోర్నీ నుంచి తప్పించారు సెలక్టర్లు...

టీ20ల్లో 28.01 సగటుతో 1877 పరుగులు చేసిన డేన్ వాన్ నీరెక్, 10 హాఫ్ సెంచరీలు బాదింది. అలాగే బౌలింగ్‌లో 5.45 ఎకానమీతో 65 వికెట్లు పడగొట్టింది. టీ20ల్లో 1500లకు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్‌గా ఉన్న డేన్ వాన్ నీరెక్‌ని ఎంపిక చేయకపోవడంపై సౌతాఫ్రికా టీమ్ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు...

సౌతాఫ్రికా కెప్టెన్ డేన్ వాన్ నీరెక్, తన సహచర ప్లేయర్ మరిజాన్నే కేప్‌ని స్వలింగ వివాహం చేసుకుంది. సౌతాఫ్రికా తరుపున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ కేప్..  టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రకటించిన జట్టులో కేప్ పేరు కూడా లేకపోవడం విశేషం. దీంతో ఈ ఇద్దరూ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం...

ఈ వివాదంపై సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిర్ వ్యంగ్యంగా స్పందించాడు... ‘ఓ... నేను నా 2 కి.మీ.ల టెస్టును కొన్ని సెకన్ల తేడాతో మిస్ అయ్యాను... అంటే నేను ఎందుకు పనికి రాను...’ అంటూ డేల్ స్టెయిన్ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...

Follow Us:
Download App:
  • android
  • ios