CSK vs RCB : ఐపీఎల్ 2024లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఎంఎస్ ధోని-విరాట్ కోహ్లీ.. !

CSK vs RCB Live Score, IPL 2024: చెన్నైలో ఐపీఎల్ 2024 సంద‌డి మొద‌లైంది. తొలి మ్యాచ్ తో నే షేక్ చేస్తూ కింగ్ విరాట్ కోహ్లీ- టీమిండియా దిగ్గ‌జ కెప్టెన్ ఎంఎస్ ధోని జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. చాలా రోజుల త‌ర్వాత ప‌రుగుల దాహంతో ఉన్న కోహ్లీ, ధోనీలు గ్రౌండ్ లో బ్యాట్ తో షేక్ చేయ‌బోతున్నారు. 
 

CSK vs RCB: MS Dhoni-Virat Kohli to be the centre of attraction in IPL 2024 IPL OPENING CEREMONY RMA

CSK vs RCB Live Score, IPL 2024 : మ‌రో క్రికెట్ ఫీవ‌ర్ మొద‌లైంది. మెగా క్రికెట్ లీగ్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) ఆరంభం అదిరిపోయింది. ఐపీఎల్ 17వ సీజ‌న్ తొలి మ్యాచ్ లో భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్లు, టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనిల టీమ్ లు త‌ల‌బ‌డ‌బోతున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూప‌ర్ కింగ్స్, సూప‌ర్ ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్లు తొలి మ్యాచ్ లో త‌ల‌ప‌డుతుండ‌టంతో ఈ సీజ‌న్ మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది.

చాలా  రోజుల త‌ర్వాత ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలు బ్యాట్ తో క్రికెట్ మైదానంలోకి దిగ‌బోతున్నారు. ప‌రుగుల దాహాన్ని తీర్చుకోవ‌డంతో దుమ్మురేప‌డానికి సిద్ధంగా ఉన్నారు. క్రికెట్ ల‌వ‌ర్స్, ఆయా ప్లేయ‌ర్ల అభిమానులు కోహ్లీ, ధోని ఆట కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కింగ్ కోహ్లీ సూప‌ర్ షాట్స్.. ధోని హెలికాలికాప్ట‌ర్ షాట్స్ తో అద‌ర‌గొట్టాల‌నుకుంటున్నారు. నిజంగానే ధోని నాటునాటు.. కింగ్ కోహ్లీ హాట్ హాట్.. ఈ ఇద్ద‌రిలో ప్లేయ‌ర్ల‌లో ఏ ఒక్కరు చెల‌రేగిన ఎంట‌ర్ టైన్ మెంట్ అద‌రిపోతుంది. ఇద్ద‌రు అద‌ర‌గొడితే దుమ్ము లేచిపోద్ది. దీంతో ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిల‌వ‌నున్నారు.

IPL OPENING CEREMONY: చెన్నైలో బాలీవుడ్ ఫ్లేవ‌ర్.. క్రికెట్ ల‌వ‌ర్స్ ను ఉర్రూతలూగించే డీజే ఆక్స్‌వెల్ షో.. !

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే ఇరు జ‌ట్ల‌లో కీల‌క మార్పులు జ‌రిగాయి. ముఖ్యంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ధోనిని కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్ప‌గించి అంద‌రికీ షాక్ ఇచ్చింది. దీంతో కెప్టెన్సీని వదులుకున్న ఎంఎస్ ధోనిపై దృష్టి పడింది. అలాగే, విరాట్ కోహ్లీ పోటీ క్రికెట్‌కు తిరిగి రావడం, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 టీమిండియా స్క్వాడ్ అంశం కావ‌డంతో కింగ్ ఎలా ఆడ‌తాడ‌నే ఆస‌క్తిక‌రంగా మారింది. ఐపీఎల్‌లో ఆర్సీబీపై చెన్నై సూపర్ కింగ్స్ 21-10 ఆధిక్యత రికార్డును కలిగి ఉంది. సీఎస్కే హోం గ్రౌండ్ లో ఆధిపత్యం చెలాయించింది. చెపాక్‌లో ఆర్సీబీతో జరిగిన ఎనిమిది మ్యాచ్ లో కేవ‌లం ఒక్క మ్యాచ్ లో మాత్ర‌మే ఓడిపోయింది.

CSK vs RCB: చెన్నైలో దుమ్మురేప‌డానికి సిద్ధ‌మైన విరాట్ కోహ్లీ.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios