ఐపీఎల్ మొదలవుతుందటే చెన్నై సూపర్ కింగ్స్ హడావుడి మామూలుగా ఉండదు. ‘విజిల్ పోడు’ అంటూ ఫ్యాన్స్‌తో పాడు క్రికెటర్లు కూడా ఆడుతూ పాడుతూ గోల గోల చేస్తారు. అయితే ఈసారి మాత్రం ఆ జట్టులో అంత సందడి కనిపించడం లేదు. రైనా, భజ్జీ వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమవ్వడంతో పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌లోని ఇద్దరు ఆటగాళ్లకు, 11 మంది సిబ్బందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

కరోనా బారిన పడిన 11 మంది సిబ్బందితో పాటు బౌలర్ దీపక్ చాహార్ కరోనా నుంచి కోలుకున్నారు. అయితే మరో ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఇంకా కోవిద్ నుంచి కోలుకోలేదు. తాజాగా చేసిన పరీక్షల్లో మరోసారి రుతురాజ్‌కి పాజిటివ్ రిపోర్టు వచ్చింది.

ఐపీఎల్ తొలివారంలో రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండడం అనుమానంగానే ఉండడంతో ప్లాన్ మారుస్తున్నాడట ధోనీ. అతని స్థానంలో వేరే ప్లేయర్‌ను తుదిజట్టులోకి తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట. సెప్టెంబర్ 19న చెన్నై