MS Dhoni IPL 2024: ధోనీ రిటైర్డ్మెంట్ పై స్పందించిన సీఎస్‌కే సీఈవో.. ఇంతకీ ఏమన్నారంటే..?

MS Dhoni IPL 2024: టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కూడా రిటర్డ్మెంట్ ప్రకటించనున్నారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ వార్తలపై ధోనీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ వార్తలు నిజమేనేమో అనే గందరగోళంలో పడ్డారు ధోని ఫ్యాన్స్. ఈ తరుణంలో ధోనీ జట్టుతో కొనసాగే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీవో కాశీ విశ్వనాథన్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు

CSK CEO Kasi Viswanathan offers update on MS Dhoni IPL retirement plans KRJ

MS Dhoni IPL 2024: టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కూడా దూరం కానున్నారనీ, త్వరలో ఆయన పొట్టి క్రికెట్ కూడా వీడ్కొలు పలుకబోతున్నరనే చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది.ఈ విషయంపై కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగుతోంది. గత సీజన్ లో కూడా మిస్టర్ కూల్ ఎం ఎస్ ధోని ఆడతాడో? లేదో ? అనే చర్చ పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ధోని మోకాలు గాయంతోనే సీజన్ 16 ఆడిన ధోని చెన్నైకి 5వసారి కప్ అందించాడు. 

అయితే.. మరో మూడు నెలల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL 2024) 17వ సీజన్‌ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ ఈ సీజన్‌ ఆడతాడా? లేదా?అనే సందేహం క్రికెట్ ఫ్యాన్స్ లో నెలకొంది. మరికొందరు 2024 ఆడుతున్నాడని, ఇదే అతనికి చివరి సీజన్‌ అంటూ బలంగా చెబుతున్నారు. ఇలా ధోని రిటర్డ్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగున్న దీనిపై ధోనీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ వార్తలు నిజమేనేమో అనే గందరగోళంలో పడ్డారు ధోని ఫ్యాన్స్. ఈ తరుణంలో ధోనీ జట్టుతో కొనసాగే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీవో కాశీ విశ్వనాథన్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

సీఈఓ కాశీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ధోనీ భవిష్యత్తు గురించి వెల్లడించారు. ధోనీకి ఇదే చివరి సీజన్ అవుతుందా? లేదాఝ అనే విషయంపై సీఈఓ కాశీ విశ్వనాథ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. "ఇది ధోనికి చివరి ఐపిఎల్ అవుతుందో.. లేదో.. నాకు తెలియదు. విషయంపై కెప్టెన్ ధోనీనే నేరుగా సమాధానం ఇస్తాడు. అయినా ఆ విషయం గురించి ఇప్పటి వరకు చర్చించలేదు. ప్రస్తుతం ధోనీ శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడి ఫిట్‌నెస్‌ బాగుంది. జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాడు. బహుశా.. మరో 10 రోజుల్లో అతను నెట్స్‌కి వచ్చి ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తాడు.’ అని చెప్పుకొచ్చారు. దీంతో ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
  
ఇదిలాఉంటే.. IPL సీజన్ 2024 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. అదే సమయంలో IPL వేలం 2024 సమయంలో CSK 6 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ జట్టులో చేర్చుకుంది. మినీ వేలంలో డారిల్ మిచెల్‌కు చెన్నై అత్యధిక మొత్తాన్ని ఇచ్చింది. డారిల్ మిచెల్‌ను చెన్నై టీం రూ. 14 కోట్లకు కొనుగోలు చేసి అతనిని తన జట్టులో చేర్చుకుంది. 

CSK ఫుల్ టీమ్ --

ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్కర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మతిషా పతిరానా, అజింక్యా రహానే, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, సింఘర్ రషీద్నర్, షేక్ రషీద్నర్ .,నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేష్ తిక్షినా, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, ముస్తాఫిజుర్ రెహమాన్, అవ్నీష్ రావ్ ఆరావళి, సమీర్ రిజ్వీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios