శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు.. ఆ వేధింపులు నిజమే.. వెలుగులోకి సంచలన విషయాలు..!
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు అయ్యాయి. శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ దంపతులకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు అయ్యాయి. శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ దంపతులకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిఖర్ ధావన్.. అతని విడిపోయిన భార్య ఏషా ముఖర్జీ నుంచి క్రూరత్వం, మానసిక వేదనకు గురయ్యాడని పేర్కొంటూ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకుల పిటిషన్‌లో తన భార్యపై ధావన్ చేసిన ఆరోపణలన్నింటినీ న్యాయమూర్తి హరీష్ కుమార్ విశ్వసించారు. ఆయేషా ముఖర్జీ.. ధావన్ పేర్కొన్న ఆరోపణలను వ్యతిరేకించలేదని లేదా ఆమెను ఆమె సమర్ధించుకోవడంలో విఫలమైందని ఫ్యామిలీ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక, రెండేళ్ల క్రిత ధావన్-అయేషా దంపతులు విడిపోతున్నట్టుగా ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే విడాకుల కోసం ధావన్.. ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన భార్య మానసికంగా వేధిస్తుందని, విడాకులు మంజూరు చేయాలని తన దరఖాస్తులో ధావన్ పేర్కొన్నారు. అయితే ధావన్ అభ్యర్థనపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు.. తాజాగా విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
‘‘వివాహానికి ముందు ధావన్ విజ్ఞప్తి మేరకు.. అతనితో కలిసి ఇండియాలో నివసించేందుకు ఆయేషా అంగీకరించింది. కానీ ఆమెకు అప్పటికే మొదటి వివాహం ద్వారా జన్మించిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే వారిని చూసుకునేందుకు అయేషా ఆస్ట్రేలియాలోనే ఉండిపోయింది. ధావన్‌కు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఇండియాలో ఎక్కువ కాలం నివసించలేదు. ధావన్-అయేషాల కుమారుడిని కూడా ఆస్ట్రేలియాలో తనతో పాటు అక్కడే ఉంచింది. దీంతో ధావన్‌కు అతనికుమారుడిని దూరం చేసిన ఆయేషా మానసిక ఆవేదనకు గురిచేసింది. అలాగే ధావన్ తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో తనకు యజమాన్య హక్కులు కల్పించాలని అయేషా ఒత్తిడి చేసినట్టుగా కోర్టు నిర్దారణకు వచ్చింది. ఒక ఒకదానిలో 99 శాతం తన పేరిట రాయాలాని, మిగిలిన రెండు ఆస్తుల్లో తనను ఉమ్మడి యజమానిగా ఉంచాలని అయేషా వేధించినట్టుగా ధావన్ పేర్కొన్నాడు. అయితే వాటిని అయేషా వ్యతిరేకించలేదు. అందువల్ల ఇవన్నీ నిజాలేనని కోర్టు విశ్వసిస్తుంది. ధావన్ పరువుకు నష్టం కలిగించేలా అయేషా ఉద్దేశపూర్వకంగా అతని తోటి క్రికెటర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సందేశాలు పంపించింది’’ అని విడాకులు మంజూరు చేసిన సందర్భంగా కోర్టు పేర్కొంది.
అయితే.. ధావన్ కుమారుడి శాశ్వత కస్టడీపై ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. భారతదేశం, ఆస్ట్రేలియాలో సహేతుకమైన వ్యవధిలో తన కుమారుడిని కలుసుకోవడానికి, అతనితో వీడియో కాల్స్ ద్వారా సంభాషించడానికి ధావన్‌కు హక్కును కోర్టు మంజూరు చేసింది. అకడమిక్ క్యాలెండర్‌లో పాఠశాల సెలవుల్లో కనీసం సగం వ్యవధిలో ధావన్, అతని కుటుంబ సభ్యులతో రాత్రిపూట బస చేయడంతోపాటు, సందర్శన నిమిత్తం చిన్నారిని భారత్‌కు తీసుకురావాలని ఆయేషాను కోర్టు ఆదేశించింది.
ఇక, ధావన్-ఆయేషాలకు 2012లో వివాహం జరిగింది. ధావన్ కన్నా ఆయేషా 10 సంవత్సరాలు పెద్దది. అయితే అప్పటికే అయేషాకు పెళ్లి రద్దై.. పిల్లలు ఉన్నారు. ఇక, ధావన్-ఆయేషా దంపతులకు 2014లో ఒక కుమారుడు జన్మించాడు. అయితే వీరి మధ్య మనస్పర్దలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితమే తాను ధావన్ నుంచి విడిపోతున్నట్టుగా ఆయేషా ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.