హర్దిక్ పాండ్యా... భారత క్రికెట్ జట్టులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. దీంతో గతకొంతకాలంగా అతడికి బాలీవుడ్ కు చెందిన పలువురు బామలతో అఫైర్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా ఊర్వశి రౌతెల్లా,  ఎల్లీ అవ్రామ్, పరిణీతి చోప్రాలతో పాండ్యా డేటింగ్‌లో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో కొత్తపేరు  వచ్చి చేరింది. బాలీవుడ్ ఐటమ్ గర్ల్ నటాషా స్టాన్‌కోవిచ్‌ తో పాండ్యా ప్రస్తుతం రిలేషన్‌‌షిప్ కొనసాగిస్తున్నట్లు  తెలుస్తోంది. 

బాలీవుడ్ సినిమాల్లో  ఐటమ్ సాంగ్ డ్యాన్సర్ గా నటాషాకు మంచి పేరుంది. బాద్షా సినిమాలో ''డీజేవాలె బాబు'' పాట ద్వారా ఆమె పాపులర్ డ్యాన్సర్ గా గుర్తింపు పొందారు.  అంతేకాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్  డ్యాన్సర్ గా నటాషా అదరగొట్టింది. 

గతకొంత కాలంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగి ఇటీవలే అది ప్రేమగా మారినట్లు సమాచారం. దీంతో పాండ్యా తన కుటుంబంలో జరిగిన ఓ పంక్షన్ కి  కూడా నటాషాను ఆహ్వానించి  కుటుంబసభ్యులకు కూడా పరిచయం చేశాడట. వెస్టిండిస్ పర్యటనకు వెళ్లకుండా విరామం తీసుకుంటున్న పాండ్యా తన  కొత్త ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. కానీ వీరిద్దరు తమ ప్రేమాయణం గురించి బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. 

ఇటీవల ఈషా గుప్తాతో పాండ్యా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు ప్రచారం జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లాడబోతున్నారని కూడా పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఈషా ఈ వార్తలను ఖండిచి అసలు హర్దిక్ పాండ్యా  ఎవరో కూడా తనకు తెలియదంటూ ఘాటుగా స్పందించింది. దీంతో వారిద్దరి రిలేషన్‌షిప్ పై ప్రచారం ఆగిందో లేదో  ఇప్పుడు నటాషాతో ప్రేమలో వున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

నటి ఈషా గుప్తాతో డేటింగ్ పై హార్దిక్ పాండ్యా స్పందన ఇదీ...

హార్దిక్ పాండ్యా ఎవరు..? ఈషా గుప్త ఫైర్