2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్! మరో మూడు ఆటలు కూడా...
2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్ పోటీల్లో క్రికెట్‌ని చేర్చాలని నిర్ణయం... ఐవోసీ సభ్యురాలిగా ఉన్న నీతా అంబానీ..
2022లో తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ జరిగింది. ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు పోటీల్లో క్రికెట్ పోటీలకు మంచి ఆదరణ దక్కింది. దీంతో 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్ పోటీల్లో క్రికెట్‌ని చేర్చాలని నిర్ణయం తీసుకుంది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)..
ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సమావేశంలో క్రికెట్‌ని చేర్చడంపై చర్చ జరిగింది. ఇంతకుముందు ఒలింపిక్స్‌లోనూ క్రికెట్ భాగంగా ఉండేది. అయితే 1900 నుంచి ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం లేదు.. 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరనుంది.
2028 లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్ నుంచి విశ్వక్రీడల్లో మళ్లీ క్రికెట్‌ని చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. టీ20 ఫార్మాట్‌లో క్రికెట్‌తో పాటు బేస్ బాల్ (సాఫ్ట్ బాల్), లాక్రోసెస్ (సిక్సెస్), స్క్వాష్ క్రీడలను కూడా ఒలింపిక్స్ 2028 పోటీల్లో భాగం చేయబోతున్నారు..
ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ యజమాని, రిలయెన్స్ సంస్థల అధినేత్రి నీతా అంబానీ కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. క్రికెట్‌ని ఒలింపిక్స్‌లో భాగం చేసేందుకు ఆమె క్రీయాశీలక పాత్ర పోషించారు. ‘ఇది భారత్‌కి మాత్రమే కాదు, క్రికెట్‌ని ఓ ఆటగా కాకుండా ఓ ఎమోషన్‌గా భావించే సౌత్ ఏషియా దేశాలన్నింటికీ ఇదో గొప్ప విజయం...’ అంటూ కామెంట్ చేసింది నీతా అంబానీ..