కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని రకాలు క్రీడలు నిలిచిపోయాయి. దీంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమైపోయారు. క్షణం తీరిక లేకుండా గడిపే వీరంతా కుటుంబసభ్యులతో ఏంజాయ్ చేస్తున్నారు.

ఇంకొందరు తమలోని కొత్త టాలెంట్‌లను బయటకు తీసుకొస్తున్నారు. అప్పుడప్పుడు టీవీలు, ఆన్‌లైన్‌ ద్వారా వివిధ అంశాలపై మాట్లాడుతూ.. తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

అలాగే కరోనా సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఇతర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా క్రికెటర్ల మధ్య ఒక ఛాలెంజ్ మొదలైంది. అదే కీప్ ఇట్ అప్.. బంతిని కిందపడకుండా ఆడటం. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఈ ఛాలెంజ్‌ను తమదైన శైలిలో పూర్తి చేశారు.

రోహిత్ శర్మ బ్యాట్ హ్యాండిల్‌తో బంతిని ఆడగా, కుంబ్లే చేతితో ఆడాడు. ఇక వీరిద్దరూ శ్రేయాస్ అయ్యర్, అజింక్య రహానే, రిషభ్ పంత్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, కేఎల్. రాహుల్‌ను నామినేట్ చేశారు.