గంగూలీ ఇంట కరోనా కలకలం: వదినతోసహా నలుగురికి పాజిటివ్

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. గంగూలీ అన్న స్నేహశీష్ భార్య, ఆమె తల్లిదడ్రులతోపాటుగా వారి ఇంట్లో పనిచేసే పనిమనిషికి కూడా కరోనా వైరస్ సోకింది. 

Coroanvirus Scare In BCCI President Sourav Ganguly's Family: Along With Brother's Wife Four Tested Positive

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. గంగూలీ అన్న స్నేహశీష్ భార్య, ఆమె తల్లిదడ్రులతోపాటుగా వారి ఇంట్లో పనిచేసే పనిమనిషికి కూడా కరోనా వైరస్ సోకింది. 

గంగూలీ అన్న స్నేహశీష్ కి కూడా కరోనా పరీక్షలు నిరవహించినప్పటికీ... అతడికి నెగటివ్ గా వచ్చింది. పొసిట్యివే గా తేలినవారందరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గంగూలీ సోదరుడు స్నేహశీష్ ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. 

స్నేహశీష్ కూడా మాజీ క్రికెటరే. రంజిలు కూడా ఆడాడు. ప్రస్తుతానికి క్రికెట్ అసోసియేషన్ అఫ్ బెంగాల్ కి కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. కరోనా వైరస్ సోకినవారందరు గంగూలీ కుటుంబసభ్యులే అయినప్పటికీ... అందరూ ఒకే ఇంట్లో ఉండడం లేదని వారు తెలిపారు. 

ఇకపోతే... భారత్ లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మృతి చెందారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభణ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

గత 24 గంటల్లో 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,95,048 కు పెరిగింది. అలాగే కొత్తగా 375 మంది కరోనాతో మరణించగా మొత్తం మరణాల సంఖ్య 12,948 కు చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతుండగా 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అప్పటికే ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో మన భారత్ 4 వ స్థానంలో ఉండటం గమనార్హం.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ భారీగానే ఉంది. రోజుకి దాదాపు 500కేసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతుండటం గమనార్హం. ఇప్పటికే తెలంగాణలో 6వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా... ఆంధ్రప్రదేశ్ లో 7వేలు దాటేసింది. దాదాపు 8వేలకు చేరువలో ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios