భారత సారథి విరాట్ కోహ్లీ గైర్హజరీతో ఆస్ట్రేలియా జట్టు రెచ్చిపోతుంది. నిన్న ఆసీస్ అభిమానుల రేసిజం కామెంట్లతో సిరాజ్‌ను అవమానిస్తే, నేడు భారత ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతీసేందుకు నానా విధాల ప్రయత్నించారు ఆసీస్ ప్లేయర్లు.

బ్యాట్స్‌మెన్‌ను గాయపరచడమే లక్ష్యంగా పెట్టుకుని బౌలర్లు బంతులు విసరగా... ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ‘గబ్బా టెస్టులో నీ వికెట్‌ తీయడానికి ఎదురుచూస్తున్నా... ఆశ్’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్.

దానికి రవిచంద్రన్ అశ్విన్... ‘నువ్వు ఇండియాకి వస్తావు గా... అది నీకు ఆఖరి సిరీస్ అవుతుందనుకుంటా...’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే టిమ్ పైన్, విహారి ఇచ్చిన క్యాచ్‌ను డ్రాప్ చేయడం విశేషం.