Asianet News TeluguAsianet News Telugu

మారుస్తామన్నారు! మళ్లీ అతనే దిక్కయ్యాడు... బీసీసీఐ అధ్యక్షుడిగా మళ్లీ చేతన్ శర్మ...

బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన చేతన్ శర్మ... నెల రోజుల హై డ్రామా తర్వాత తిరిగి చేతన్‌కే పగ్గాలు అప్పగించిన బీసీసఐ.. 

Chetan Sharma is once again chairman of BCCI selection committee
Author
First Published Jan 7, 2023, 5:50 PM IST

ఊహించినట్టే బీసీసీఐ యూటర్న్ తీసుకుంది. సెలక్షన్ కమిటీ ఛైర్మెన్‌గా తిరిగి చేతన్ శర్మకే పగ్గాలు అప్పగించింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్‌లో ఓడిన టీమిండియా, బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్‌లోనూ చిత్తుగా ఓడింది. ఈ రెండు పరాజయాలతో సెలక్షన్ కమిటీపై వేటు వేసింది బీసీసీఐ...

కొత్త సెలక్షన్ కమిటీ సభ్యుల కోసం దరఖాస్తులు కోరింది. వెంకటేశ్ ప్రసాద్ వంటి మాజీ క్రికెటర్లు, బీసీసీఐ సెలక్షన్ కమిటీకి అప్పీలు చేసుకున్నా...  పైరవీలే చేశాడో లేక పాపులారిటీనే వాడాడో కానీ  మళ్లీ చేతన్ శర్మే బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు...

చేతన్ శర్మను తిరిగి సెలక్షన్ కమిటీ హెడ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, ఈస్ట్ జోన్‌కి సుబ్రోతో బెనర్జీ, సెంట్రల్ జోన్‌కి ఎస్‌ఎస్ దాస్‌ని, సౌత్ జోన్‌కి ఎస్ శరత్‌ని, వెస్ట్ జోన్‌కి సలీల్ అంకోలాని సెలక్టర్లుగా నియమిస్తున్నట్టు ప్రకటన ద్వారా తెలియచేసింది...  టీ20 వరల్డ్ కప్ 2021, 2022 టోర్నీలతో పాటు ఆసియా కప్ 2022 టోర్నీలోనూ టీమిండియా ఆశించిన స్థాయి పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది...

ముఖ్యంగా కీలక టోర్నీల్లో టీమిండియా పేలవ ప్రదర్శనకు సెలక్టర్లు, సరైన ప్లేయర్లను ఎంపిక చేయలేకపోవడమేననే వాదన వినిపించింది. చేతన్ శర్మ కమిటీ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో వారిని తప్పిస్తున్నట్టు, కొత్త సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటన వెలువరించింది బీసీసీఐ. దీంతో టీమ్ పర్ఫామెన్స్ బాగా లేదనే కారణంగా సెలక్టర్లపై వేటు వేశారని భావించారంతా..

దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపే పర్ఫామెన్స్ ఇస్తున్న పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లకు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విధానంపై తీవ్రమైన ఆరోపణలు వినిపించాయి. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ని ఎంపిక చేయకపోవడం, ఉమ్రాన్ మాలిక్‌, పృథ్వీ షా వంటి ప్లేయర్లను పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌గా మారిన కొందరు మాజీ క్రికెటర్లు..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ని ఎంపిక చేయకపోవడం, ఉమ్రాన్ మాలిక్‌, పృథ్వీ షా వంటి ప్లేయర్లను పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌గా మారిన కొందరు మాజీ క్రికెటర్లు.. 37 ఏళ్ల వయసులో దినేశ్ కార్తీక్‌ని టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి... అంతకుముందు 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇలాంటి ట్రోల్స్ బాగానే వినిపించాయి.

ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్‌లను మెగా టోర్నీకి ఎంపిక చేసిన సెలక్టర్లు, యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి తీవ్ర వివాదాస్పదమైంది.. 37 ఏళ్ల వయసులో దినేశ్ కార్తీక్‌ని టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి... అంతకుముందు 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇలాంటి ట్రోల్స్ బాగానే వినిపించాయి. ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్‌లను మెగా టోర్నీకి ఎంపిక చేసిన సెలక్టర్లు, యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి తీవ్ర వివాదాస్పదమైంది..

అయితే ఎన్ని ట్రోల్స్ వచ్చినా తిరిగి చేతన్ శర్మ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మెన్‌గా బాధ్యతలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios