భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్... మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ఉండడంతో పాటు తమిళనాడు ప్రజలకు తగ్గట్టుగా సీఎస్‌కె రూపొందించే ప్రచార కార్యక్రమాలు కూడా ఈ క్రేజ్‌కు ప్రధాన కారణం. ఈ సీజన్‌ ప్రారంభానికి ముందే కష్టాలను ఎదుర్కొంటున్న చెన్నై, జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇం

దులో భాగంగా ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. 
చెన్నై స్లోగన్‌ ‘విజిల్ పోడు’కి తగ్గట్టుగానే ఈ ప్రొమో రూపొందుతోంది. ధోనీ పాఠాలు చెబుతుంటే, క్లాస్‌లో విజిల్ వేస్తారు. ‘నా క్లాస్ రూమ్‌లో విజిల్ వేసింది ఎవరు?’ అని ధోనీ అడగ్గా... మిగిలిన సభ్యులందరూ కేదార్ జాదవ్‌వైపు చూపిస్తారు. ఇలా సరదాగా సాగే ప్రొమోలతో సీఎస్‌కెలో నూతన ఉత్తేజం నింపుతున్నారు ధోనీ అండ్ కో.

 

 

ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, దాదాపు 15 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన ప్రతీ సీజన్‌లో ఫ్లేఆఫ్ చేరిన ఏకైక జట్టుగా రికార్డు క్రియేట్ చేసిన ధోనీ సేన, ఎనిమిదిసార్లు ఫైనల్ చేరింది.