Asianet News TeluguAsianet News Telugu

మొన్న వార్నర్.. నిన్న బ్రావో.. నేడు షకిబ్ అల్ హసన్.. ఎవ్వరూ తగ్గట్లేగా.. బీపీఎల్ ను తాకిన పుష్ప ఫీవర్

Pushpa Craze In Bangladesh Premier League:  అల్లు అర్జున్ పుష్ప  క్రేజ్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కు తాకింది.  రవీంద్ర జడేజా నుంచి సురేశ్ రైనా దాకా..  డేవిడ్ వార్నర్ నుంచి డ్వేన్ బ్రావో దాకా.. ఎవరిని కదిలిచ్చినా ఇదే బాట. తాజాగా...

BPL 2022: Shakib Al Hasan Copies Allu Arjun's Move From Pushpa, video goes viral
Author
Hyderabad, First Published Jan 27, 2022, 1:24 PM IST

పుష్ప సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై థియేటర్ల నుంచి కనుమరుగైంది. ప్రస్తుతం  ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తున్నది. అయితే థియేటర్ల నుంచి వెళ్లినా సినీ జనాలకే కాదు.. క్రికెటర్లనూ  పుష్ప  క్రేజ్ వదలడం లేదు. రవీంద్ర జడేజా నుంచి సురేశ్ రైనా దాకా.. సూర్యకుమార్ యాదవ్ నుంచి  హార్దిక్ పాండ్యా దాకా..  డేవిడ్ వార్నర్ నుంచి డ్వేన్ బ్రావో దాకా.. ఎవరిని కదిలిచ్చినా ఇదే బాట. పుష్ప సినిమాలోని ‘తగ్గేదే లే’, ‘యే బిడ్దా ఇది నా అడ్డా..’, ‘చూపే బంగారమాయేనే..’ లెగ్ మూమెంట్.. ఈ జాబితాలో ఇప్పుడు మరో స్టార్ ఆల్ రౌండర్ చేరాడు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్  షకిబ్ అల్ హసన్ కూడా  తాజాగా పుష్ప స్టెప్ ను  అనుకరించాడు. కానీ చిన్న ట్విస్ట్ తో..

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో పుష్ప హవా నడుస్తున్నది. అదేంటి అక్కడ పుష్ప సినిమా  విడుదలైందా..? అనుకుంటున్నారా.. అస్సలు కాదు. క్రికెటర్లలో ఇప్పుడంత పుష్ప సీజన్ నడుస్తుంది కదా. ఇందులో భాగంగా.. శ్రీవల్లి హుక్ స్టెప్  బీపీఎల్ కు చేరింది.

 

వారం రోజుల క్రితం బౌలర్ నజ్ముల్  ఇస్లాం.. వికెట్ తీసిన ఆనందంలో  ‘తగ్గేదే లే..’ అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. బుధవారం కొమిల్లా విక్టోరియన్స్ ,ఫార్చ్యూన్ బారిషల్ మధ్య జరిగిన మ్యాచులో బ్రావో.. ‘చూపే బంగారమాయేనే..’ స్టెప్ వేశాడు. తాజాగా షకిబ్ అల్ హసన్.. ఇదే మ్యాచులో  దక్షిణాఫ్రికా బ్యాటర్ డుప్లెసిస్ ను ఔట్ చేశాక  అల్లు అర్జున్ ను కాపీ కొట్టాడు. అయితే షకిబ్.. ‘తగ్గేదే లే’ మేనరిజమ్ కు  ‘శ్రీవల్లి’ లెగ్ మూమెంట్ ను జతచేశాడు. షకీబ్ వేసిన కొత్త స్టెప్ నకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

పుష్ప సినిమాకు హసన్ తాజాగా స్టెప్పులు వేసినా.. క్రికెట్ లో పుష్ప ట్రెండ్ ను  డేవిడ్ వార్నర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా,  సూర్యకుమార్ యాదవ్,  ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యాలు పూర్తి చేశారు. తాజాగా వీరి సరసన  హసన్ కూడా చేరాడు. మరి భవిష్యత్తులో ఈ స్టెప్పులకు ఎంత మంది క్రికెటర్లు.. గ్రౌండ్స్ లో స్టెప్పులేస్తారో వేచి చూడాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios