భారతీయులకు ఎంతో ఇష్టమైనవి రెండే రెండు ఒకటి సినిమా, రెండోది క్రికెట్! కరోనా కారణంగా ఈ రెండింటిపై తీవ్రమైన ప్రభావం పడింది. లాక్‌డౌన్‌లో సినిమా థియేటర్లకు మూతబడగా మార్చి నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్, వాయిదా పడింది. నవంబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీ కూడా వచ్చే ఏడాదికి వెళ్లిపోయింది.

సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించకపోయినా, క్రికెట్ సమరానికి మాత్రం ముహుర్తం ముంచుకొస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుండడంతో టీవీ ఛానెళ్లకు గుండెల్లో గుబులు మొదలైందట. కరోనా భయంతో ఇంట్లో ఉంటూ సీరియళ్లు, ‘బిగ్‌బాస్’ వంటి ప్రోగ్రామ్‌లు చూస్తూ కాలక్షేపం చేశారు జనాలు.

ఐపీఎల్ ప్రారంభం అయితే అందరి ఫోకస్ అటువైపే వెళ్లిపోతుంది. ఫలితంగా ‘బిగ్‌బాస్’, ‘జబర్ధస్త్’ వంటి టీవీషోలకు వీక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. టీవీల్లో భారీగా టీర్పీలు దక్కించుకున్న సినిమాలను కూడా ప్రైమ్ టైమ్‌లో పట్టించుకునేవారు ఉండరు. ఇప్పటికే సోషల్ మీడియాలో దీని గురించి ట్రోల్స్ వినిపిస్తున్నాయి.