నాలుగో టెస్టు ఆరంభానికి ముందు భారత జట్టుకి ఊహించని షాక్ తగిలింది. నాలుగో రోజు బౌలింగ్ చేస్తూ గాయపడిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా... కీలకమైన నాలుగో టెస్టుకి దూరమైనట్టు సమాచారం.

ఇప్పటికే షమీ, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లు పేసర్లు గాయంతో సిరీస్‌ మధ్యలో దూరం కావడం, ఇషాంత్ శర్మ గాయంతో టెస్టు సిరీస్‌కి హాజరుకాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న టీమిండియా... బుమ్రా దూరమైన చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే కెఎల్ రాహుల్, షమీ, ఉమేశ్ యాదవ్, హనుమ విహారి, రవీంద్ర జడేజా... టెస్టు సిరీస్ మధ్యలో గాయపడ్డారు. ఇప్పుడు ఆ జాబితాలోకి బుమ్రా కూడా చేరిపోయాడు. బుమ్రా స్థానంలో శార్దూల్ ఠాకూర్ లేదా జస్ప్రిత్ బుమ్రా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. 

ఇప్పటికే నవ్‌దీప్ సైనీ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. దుర్బేద్యమైన గబ్బా పిచ్‌పై యంగ్ పేసర్లు ఎంత మేరకు ప్రభావం చూపిస్తారనేది అనుమానమే...