గాయాలతో మ్యాచ్ లకు దైరమైన కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, కమలేష్ నాగర్ కోటి, శుభమన్ గిల్ లు.. కోలుకుంటున్నట్లు సమచారం. ఇప్పటికే వీరు నేషనల్ క్రికెట్ అకాడమీ కి చేరుకున్నారు. 

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండగ మళ్లీ మన ముందుకు వస్తోంది. కరోనా కారణంగా ఆగిపోయిన కరోనా మ్యాచ్ లను మళ్లీ పునరుద్దరిస్తున్నారు. దుబాయి వేదికగా.. సెప్టెంబర్ 19 నుంచి ఈమ్యాచ్ లు మళ్లీ జరగనున్నాయి. దీంతో.. ఐపీఎల్ ప్రియులంతా ఆనందంగా ఎదురు చూస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఐపీఎల్ లో రెండుసార్లు విజేతగా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ ని తెలియజేశారు. గత కొంతకాలంగా.. గాయాలతో మ్యాచ్ లకు దైరమైన కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, కమలేష్ నాగర్ కోటి, శుభమన్ గిల్ లు.. కోలుకుంటున్నట్లు సమచారం. ఇప్పటికే వీరు నేషనల్ క్రికెట్ అకాడమీ కి చేరుకున్నారు.

వీరు కనుక ఫిట్ నెస్ లో స్ట్రాంగ్ గా ఉన్నారని నిరూపించుకుంటే.. వీరు ఐపీఎల్ లో భాగం అయ్యే అవకాశం ఉంటుంది. వీరిని త్వరలో ఫిట్నెస్ టెస్ట్ కి పంపించనున్నారు. అందులో పాస్ అవ్వగానే.. వచ్చే నెల జరగనున్న టీ20 టోర్నమెంట్ లో భాగమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వీరు కనుక ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అయితే.. కేకేఆర్ టీమ్ మరింత స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి.. ఇది కచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.