IPL Retention Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)   వచ్చే సీజన్ కోసం త్వరలో నిర్వహించబోయే వేలానికి ముందు ఆయా జట్లు నిలుపుకోబోయే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విడుదల చేసింది. 

వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి రెండు కొత్త జట్లు రానున్న నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఆయా ఫ్రాంచైజీలు నిలుపుకోబోయే ఆటగాళ్ల జాబితాను అందించాలని గడువు విధించింది. నేటితో ఆ గడువు ముగిసింది. దీంతో సుమారు నెల రోజులుగా క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని వేచి చూసిన సమయం రానే వచ్చింది. ఏ జట్లు ఏ ఆటగాళ్లను నిలుపుకున్నాయి..? ఎవర్ని వదిలేశాయి..? అనే విషయంపై ఓ స్పష్టత వచ్చింది. ఈ మేరకు బీసీసీఐ తుది జాబితాను విడుదల చేసింది. మరి 8 ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను నిలుపుకున్నాయో ఇక్కడ చూద్దాం. 

అందరూ ఊహించినట్టుగానే.. కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు, వినిపిస్తున్న గుసగుసలకు అనుగుణంగానే ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల ను అట్టిపెట్టుకున్నాయి. ఇక నిలుపుకోవడానికి వీలులేని ఆటగాళ్లను వదిలేశాయి. మరి వాళ్లను వేలంలో దక్కించుకుంటారా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

Scroll to load tweet…

ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు నిలుపుకున్న ఆటగాళ్ల జాబితా : కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు) .. (పర్స్ లో మిగిలిఉన్న నగదు రూ. 68 కోట్లు) 

Scroll to load tweet…

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అట్టిపెట్టుకున్నది వీళ్లనే : ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు) (మిగిలిఉన్న మొత్తం రూ. 48 కోట్లు)

Scroll to load tweet…

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఉండబోయేది వీళ్లే : విరాట్ కోహ్ల (రూ. 15 కోట్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ. 11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 11 కోట్లు) (మిగిలిఉన్న నగదు రూ. 57 కోట్లు) 

Scroll to load tweet…

ముంబై ఇండియన్స్ (MI) దక్కించుకుంది ఈ నలుగురినే : రోహిత్ శర్మ (16), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు) (మిగిలిఉన్న నగదు రూ. 48 కోట్లు)

Scroll to load tweet…

పంజాబ్ సూపర్ కింగ్స్ (PBKS) నిలుపుకున్నది వీళ్లనే : మయాంక్ అగర్వాల్ ( రూ. 14 కోట్లు), అర్ష్దీప్ సింగ్ (రూ. 4 కోట్లు) (మిగిలిఉన్న నగదు రూ. 72 కోట్లు)

Scroll to load tweet…

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రిటైన్డ్ ప్లేయర్స్ : రిషభ్ పంత్ (రూ. 16 కోట్లు) , అక్షర్ పటేల్ ( రూ. 9 కోట్లు), పృథ్వీ షా (రూ. 7.5 కోట్లు), ఎన్రిచ్ నార్త్జ్ (రూ. 6.5 కోట్లు).. (మిగిలిఉన్న మొత్తం రూ. 47.5 కోట్లు)

Scroll to load tweet…

రాజస్థాన్ రాయల్స్ (RR) రిటైన్ చేసుకున్నది వీళ్లే : సంజూ శాంసన్ (రూ. కోట్లు), బట్లర్ (రూ. కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ. కోట్లు).. (మిగిలి ఉన్న రూ. 62 కోట్లు)

Scroll to load tweet…

కోల్కతా నైట్ రైడర్స్ (KKR) రిటైన్డ్ ప్లేయర్లు : ఆండ్రూ రస్సెల్ (రూ. 16 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు).. (మిగిలిఉన్న మొత్తం రూ. 42 కోట్లు)

ఇదిలాఉండగా.. గతంతో పోల్చితే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని ల విలువ భారీగా తగ్గింది. మొన్నటివరకు కోహ్లీకి ఆర్సీబీ రూ. 17 కోట్లు చెల్లించగా.. అది రూ. 15 కోట్లకు తగ్గింది. ఇక ధోనికి సీఎస్కే రూ. 15 కోట్లు చెల్లించగా.. ఇప్పుడు రూ. 12 కోట్లే అందించింది. జడేజా కు ఏకంగా రూ. 16 కోట్లు ముట్టజెప్పడం గమనార్హం.