టీం ఇండియా విరాట్ కోహ్లీ... తరచూ ఎదో ఓక విషయంలో వార్తల్లోకి ఎక్కుతుంటారు. పరుగుల రారాజుగా పేరు సంపాదించుకున్న కోహ్లీ.. కేవలం తన రికార్డులతోనే కాకుండా... తన ముఖ కవలికలతో కూడా వార్తల్లోకి ఎక్కుతుంటాడు. మైదానంలో ఆట మధ్యలో వివిధ రకాల ఎక్స్ ప్రెషన్స్ తో సందడి చేస్తుంటాడు కోహ్లీ. ఇప్పటికే కోహ్లీవి ఇలాంటి ఫన్నీ ఫోటోస్ వైరల్ అయ్యాయి. తాజాగా కోహ్లీ క్యాన్ డిడ్ పిక్ ఒకటి బీసీసీఐ తన ట్విట్టర్ లో పోస్టు చేయగా.... అది కాస్త వైరల్ గా మారింది. ఆ ఫోటోకి క్యాప్షన్ మీరే ఇవ్వాలని బీసీసీఐ అభిమానులను కోరడం విశేషం. దీంతో... ఫ్యాన్స్  కోహ్లీని... గల్లీబాయ్ చేసేశారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రస్తుతం టీమిండియా రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్ మధ్యలో కోహ్లీ ని కెమేరామెన్ క్లిక్ మనిపించాడు. ఆ ఫోటోలో కోహ్లీ.. సింహంలాగా ఫోజు ఇచ్చాడు. ఈ క్యాన్ డిడ్ పిక్ ని తాజాగా బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసింది. దానికి క్యాప్షన్ చెప్పాలంటూ... బీసీసీఐ అభిమానులను కోరింది.

కాగా... అభిమానులంతా.. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన హిట్ సినిమా గల్లీ బాయ్ లోని ఓ పాటను కోహ్లీ ఫోటోకి క్యాప్షన్ గా పెట్టారు. ఆ సినిమాలోని ‘బాగ్ బాగ్ బాగ్ ఆయా షేర్ ఆయా షేర్’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది. కాగా.. దానిని కోహ్లీ ఫోటోకి క్యాప్షన్ గా ఇచ్చారు అభిమానులు. ‘‘ పరిగెత్తు... సింహం వస్తోంది’ అనే అర్థం వచ్చేలా ఉంటుంది ఆ పాట. దాదాపు చాలా మంది గల్లీబాయ్ లోని పాటనే క్యాప్షన్ గా ఇవ్వగా... కొందరు మాత్రం... ఈ ఫోటో టీం ఇండియా కోచ్ రవిశాస్త్రిని  ట్రోల్ చేయడం విశేషం. 

రవిశాస్త్రి బీర్ బాటిల్ ని చూసినప్పుడు ఇలాంటి ఎక్స్ ప్రెషన్ పెడతారంటూ కొందరు ట్వీట్ చేయడం గమనార్హం. ఇంకొందరేమో... రవిశాస్త్రి బాటిల్ లోని వాటర్ ని కోహ్లీ తాగినప్పుడు ఇలా రియాక్ట్ అవుతాడని పేర్కొన్నారు. మరికొందరు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ను కూడా ఇందులోకి లాగి ఫన్నీ క్యాప్షన్స్ ఇచ్చారు.