BCCI: టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు నేరుగా  న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమిండియా.. మూడు వన్డేలతో పాటు మూడు టీ20లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. 

ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఆడుతున్న భారత జట్టు.. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ తో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. ఈ మేరకు ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనుండగా.. టీ20లకు హార్ధిక్ పాండ్యా ఆ బాధ్యతలను మోయనున్నాడు. న్యూజిలాండ్ తో పాటు డిసెంబర్ లో జరుగబోయే బంగ్లాదేశ్ పర్యటనకు కూడా జట్టును ప్రకటించింది. బీసీసీఐ.

ప్రపంచకప్ లో ఆడుతున్న టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, అశ్విన్ లకు కివీస్ పర్యటనలో విశ్రాంతి దక్కింది. టీ20 ప్రపంచకప్ లో చోటు దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్ తో పాటు జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ కు వన్డే, టీ20 జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్ లలో రిషభ్ పంత్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. 

నవంబర్ 18 న మొదలయ్యే న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు తొలుత మూడు టీ20లు ఆడుతుంది. నవంబర్ 18, 20, 22న ఈ మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 25, 27, 30 న టీమిండియా కివీస్ తో మూడు వన్డేలు ఆడనుంది. 

న్యూజిలాండ్ తో వన్డేలకు భారత జట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ 

న్యూజిలాండ్ తో టీ20 లకు.. : హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ 

Scroll to load tweet…

బంగ్లాదేశ్ తో టెస్టు, వన్డేలకు జట్టు ఎంపిక.. 

కివీస్ పర్యటన తర్వాత భారత జట్టు అక్కడ్నుంచి నేరుగా బంగ్లాదేశ్ కు చేరుకుంటుంది. ఈ పర్యటనను భారత్.. డిసెంబర్ 4 న మొదలయ్యే తొలి వన్డేతో ప్రారంభించనుంది. డిసెంబర్ 7న రెండో వన్డే, 10న మూడో వన్డే జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్టు, 22 నుంచి 26 వరకు రెండో టెస్టు జరుగుతాయి. ఈ సిరీస్ కు భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుండటం గమనార్హం. 

బంగ్లాదేశ్ తో వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్ 

టెస్టులకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్