Asianet News TeluguAsianet News Telugu

తొలి టీ20: టీమిండియాకు షాక్, బంగ్లాదేశ్ విజయం

రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాకు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో ఇండియాను బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఓడించింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ముందు ఇండియా బౌలర్లు తేలిపోయారు.

Bangladesh vs India Delhi T20 updates
Author
Delhi, First Published Nov 3, 2019, 9:03 PM IST

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో బంగ్లాదేశ్ టీమిండియాకు షాక్ ఇచ్చింది. ముషాపికుర్ రహీం దెబ్బకు భారత బౌలింగు తేలిపోయింది. భారత్ తమ ముందు ఉంచిన 149 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. 

విజయానికి ఒక్క పరుగు కావాల్సిన స్థితిలో మహ్మదుల్లా సిక్సర్ కొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముషాఫికుర్ రహీం 43 బంతుల్లో ఒక సిక్స్, 8 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. మహ్మదుల్లా 7 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ సాయంతో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ల్లో లిటన్ దాస్ 7 పరుగులు చేయగా, మొహమ్మద్ నైమ్ 26 పరుగులు చేశాడు. సౌమ్య సర్కార్ 35 బంతుల్లో 39 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో చాహర్, అహ్మద్, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు. 

 

బంగ్లాదేశ్ పై ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. విజయానికి బంగ్లాదేశ్ విజయానికి 149 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచులో విఫలమయ్యాడు. 

బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, తొలి ఓవరులోనే టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. మైదానంలోకి దిగగానే దూకుడుగా ఆడడానికి ప్రయత్నించిన రోహిత్ శర్మ 4 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. షపీవుల్ బౌలింగ్ లో రోహిత్ శర్మ అవుటయ్యాడు. 

మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 42 బంతుల్లో 41 పరుగులు చేయడంతో స్కోరు కాస్తా పెరిగింది. కెఎల్ రాహుల్ 17 బంతుల్లో 15 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 13 బంతుల్లో 22 పరుగులు చేశారు. రిషబ్ పంత్ కాస్తా ఫరవా లేదనిపించాడు. అతను 26 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దూబే 1 పరుగులు మాత్రమే చేశాడు. కృణాల్ పాండ్యా 8 బంతుల్లో 15 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 5 బంతుల్లో 14 పరుగులు చేయడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది.

బంగ్లాదేశ్ బౌలర్లలో షఫివుల్ల్ ఇస్లామ్, అమినుల్ ఇస్లామ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. హొస్సేన్ కు ఒక వికెట్ దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios