బాంగ్లాదేశ్ క్రికెట్ టీం ను కరోనా కుదిపేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ ముష్రఫీ మొర్తాజా, మరో క్రికెటర్ నఫీస్‌ ఇక్బాల్‌లకు కరోనా సోకింది. మొర్తాజా రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా.. శుక్రవారం కరోనా పరీక్షలకు పంపారు. 

శనివారం అతడికి పాజిటివ్‌ అని తేలింది. ఢాకాలోని ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని, దయచేసి అతని కోసం అందరూ ప్రార్ధించాలని మొర్తాజా తమ్ముడు మోర్సాలిన్‌ బిన్‌ మోర్తాజా ఓ మీడియాకు తెలిపాడు. 

బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ సభ్యుడు కూడా అయిన మొర్తాజా.. కరోనా కాలంలో నియోజకవర్గ ప్రజలకు సాయపడి దాతృత్వాన్ని చాటుకున్నాడు. మాజీ క్రికెటర్‌ నఫీస్‌ ఇక్బాల్‌కు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ వన్డే కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ సోదరుడే నఫీస్‌ ఇక్బాల్‌. గత వారం పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదికి కరోనా సోకిన విషయం తెలిసిందే.