Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్ క్రికెటర్ల స్టైక్... దిగి వచ్చిన బోర్డు... భారత్ తో మ్యాచ్ కి లైన్ క్లియర్

బోర్డు దిగి రావడంతో క్రికెటర్లు కూడా తమ సమ్మెకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్లా హాసన్ మీడియాతో మాట్లాడారు. క్రికెటర్ల డిమాండ్లు నెరవేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు  చెప్పారు. తమ క్రికెటర్లు కోరిన తొమ్మిది డిమాండ్లలో రెండు మినహాయించి మిగితా వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Bangladesh cricketers call off strike after BCB accepts demands
Author
Hyderabad, First Published Oct 24, 2019, 1:42 PM IST

తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఇటీవల బంగ్లాదేశ్ క్రికెటర్లు స్ట్రైక్ కి దిగగా... ఆ దేశ క్రికెట్ బోర్డు దిగి వచ్చింది.  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్రికెటర్లకు స్పష్టమైన హామీ లభించడంతో స్ట్రైక్ విరమించారు. ఈ మేరకు తమ క్రికెటర్లు ఆ దేశ బోర్డు సుదీర్ఘ చర్చలు జరిపింది. అనంతరం.. వారి డిమాండ్లను పరిష్కరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

బోర్డు దిగి రావడంతో క్రికెటర్లు కూడా తమ సమ్మెకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్లా హాసన్ మీడియాతో మాట్లాడారు. క్రికెటర్ల డిమాండ్లు నెరవేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు  చెప్పారు. తమ క్రికెటర్లు కోరిన తొమ్మిది డిమాండ్లలో రెండు మినహాయించి మిగితా వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని క్రికెటర్లతో జరిపిన చర్చలో ప్రస్తావించడంతో వారు అందుకు అంగీకారం తెలిపారని చెప్పారు.

ఫలితంగా క్రికెటర్ల సమ్మెలో కీలక ప్రాత పోషించిన షకిబుల్ హాసన్ కు డిమాండ్ విషయంపై క్లారిటీ ఇచ్చామన్నాడు. క్రికెటర్ల సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం నుంచి తమ జాతీయ క్రికెటర్లు యథావిధిగా మ్యాచ్ లకు సిద్ధంగా కానున్నట్లు ఆయన చెప్పారు.

దాంతో వచ్చే నెలలో భారత్‌తో జరుగనున్న మూడు టీ20ల సిరీస్‌తో పాటు,  రెండు టెస్టుల సిరీస్‌కు అడ్డంకులు తొలగిపోయాయి.  వచ్చే నెల 3 నుంచి భారత్‌లో బంగ్లా పర్యటన మొదలవుతుంది. సొమవారం కాంట్రాక్టు మొత్తాల పెంపుతో పాటు తమ డిమాండ్లు తీర్చకపోతే ఏ స్థాయి క్రికెటైనా ఆడబోమంటూ బంగ్లా క్రికెటర్లు నిరసన బాట పట్టాడరు.  

మైదాన సిబ్బంది, ఆటగాళ్ల జీతాలు పెంచడం, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఫీజు పెంచడం, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మార్పులు, ప్రయాణ ఖర్చుల పెంపు వంటి డిమాండ్లతో సమ్మెకు దిగారు. మొత్తం 11 ప్రధాన డిమాండ్లతో నిరసన గళం వినిపించారు. దాంతో వెంటనే లాయర్‌ సమక్షంలో చర్చలు జరిపిన బీసీబీ.. దాదాపు అన్ని డిమాండ్లను నేరవేర్చడానికి ముందుకొచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios