Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ సేనది పాత కథే: ఢిల్లీ చేతిలో బెంగళూర్ ఓటమి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. 

Bangalore vs Delhi, IPL 2019,  Live Cricket updates
Author
Bangalore, First Published Apr 7, 2019, 4:18 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కోహ్లీ సేన తమ ముందు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.5 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. 

ఢిల్లీ విజయంలో శ్రేయస్‌ అయ్యర్‌( 50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు) కీలక పాత్ర పోషించాడు. అతనికి జోడీ పృథ్వీ షా(22 బంతుల్లో 5ఫోర్లతో 28 పరుగులు), ఇన్‌గ్రామ్‌(21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌లతో 22 పరుగులు) తమ వంతు పాత్ర పోషించడంతో ఢిల్లీ విజయాన్ని అందుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 41, మొయిన్ అలీ 32 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో రబాడా 4, క్రిస్ మోరీస్ 2, అక్షర్ పటేల్, సందీప్ తలో వికెట్ పడగొట్టారు. 

బెంగళూరు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో మొహమ్మద్ సిరాజ్ ఒక పరుగు చేసి ఔటయ్యాడు. పవన్ నేగీ పరుగులేమి చేయకుండా రబాడా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్‌కు సహకరించిన అక్షదీప్‌నాథ్‌ను రబాడా వెనక్కిపంపాడు. వచ్చినప్పటి నుంచి వరుస ఫోర్లతో విరుచుకుపడిన అక్ష‌దీప్‌ స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఔటయ్యాడు. 

చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబాడా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇతని ఇన్నింగ్సులో 2 సిక్సులు, 1 ఫోర్ ఉన్నాయి.ధాటిగా ఆడిన మొయిన్ అలీ 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లామించేన్‌‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేవలం 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో మొయిన్ అలీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు.

కొద్దిసేపు నిలకడగా ఆడి కెప్టెన్ విరాట్ కోహ్లీకి సహకరించిన మార్కస్ స్టోయినిస్ ఔటయ్యాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అక్సార్ బౌలింగ్‌లో అతను వెనుదిరిగాడు .విధ్వంసక ఆటగాడు డివిలియర్స్ ఔటవ్వడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. వచ్చి రావడంతోనే ఒక సిక్స్, ఒక ఫోర్‌తో మంచి ఊపులో ఉన్న ఏబీ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబాడా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రాయల్ ఛాలెంజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ మోరీస్ బౌలింగ్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ పార్థీవ్ పటేల్ పెవిలియన్ చేరుకున్నాడు. అంతకు ముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios