పీసీబీ అధ్యక్షుడు జాకా ఆష్రఫ్‌కీ, బాబర్ ఆజమ్‌కి మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. అవన్నీ పుకార్లేనంటూ వాట్సాఫ్ ఛాట్ లీక్ చేసిన పాక్ న్యూస్ ఛానెల్.. 

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది పాకిస్తాన్. నెం.1 వన్డే టీమ్‌గా ఉన్న పాకిస్తాన్, నెం.1 వన్డే బ్యాటర్ బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో పాక్, ప్రపంచ కప్‌కి ముందు వరుస విజయాలు అందుకుంది. వన్డే వరల్డ్ కప్‌లో రెండు వరుస విజయాలు అందుకున్న పాకిస్తాన్, అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది..

ఈ మ్యాచ్ తర్వాత వరుసగా మరో మూడు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్, సెమీ ఫైనల్ ఛాన్సులను సంక్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో టాప్ 6లో ఉన్న పాకిస్తాన్, టాప్ 4లోకి రావాలంటే... ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కంటే మెరుగైన పర్ఫామెన్స్ ఇవ్వాలి..

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జాకా ఆష్రఫ్‌కి, బాబర్ ఆజమ్‌కీ మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే పాకిస్తాన్ జట్టు సరిగ్గా ప్రదర్శన ఇవ్వలేకపోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. బాబర్ ఆజమ్ ఫోన్ చేసినా, జాకా ఆష్రఫ్ కాల్ లిఫ్ట్ చేయలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి... తాజాగా దీని గురించి పాకిస్తాన్ న్యూస్ ఛానెల్ ఏఆర్‌వై న్యూస్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది..

Scroll to load tweet…

‘బాబర్, నువ్వు ఛైర్మెన్‌కి ఫోన్ చేస్తున్నా, అతని కాల్ ఎత్తడం లేదని టీవీలో, సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం అవుతోంది. అది నిజమైనా? నువ్వు కాల్ చేశావా’ అని మెసేజ్ పంపిన అతను అడగ్గా.. దానికి బాబర్ ఆజమ్ ‘సలామ్ సల్మాన్ భాయ్.. నేను సర్‌కి కాల్ చేయలేదు..’ అని సమాధానం ఇచ్చినట్టు వాట్సాప్ మెసేజ్‌లను ప్రసారం చేసింది ఏఆర్‌వై న్యూస్..

దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ స్పందించాడు. ‘అసలు ఏం చేద్దామని చూస్తున్నారు? ఇది చాలా దారుణం. మీరు చాలా సంతోషంగా ఉండి ఉంటారు. బాబర్ ఆజమ్‌ని వదిలేయండి. అతను పాకిస్తాన్ క్రికెట్‌కి ఓ విలువైన ఆస్తి..’ అంటూ ట్వీట్ చేశాడు వకార్ యూనిస్..