‘హాస్య బ్రహ్మా’బ్రహ్మానందానికి తెలుగు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోలకైనా హేటర్స్, యాంటీ ఫ్యాన్స్ ఉంటారేమో కానీ సినిమాలు చూసే ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం అంటే ఇష్టపడాల్సిందే, ఆయన కామెడీ చూసి పడి నవ్వాల్సిందే.

మీమీ వరల్డ్‌లో అయితే బ్రహ్మా ఓ లివింగ్ లెజెండ్. ఆయన ఎక్స్‌ప్రెషన్లతోనే రొటీన్ మీమీ కూడా జనాలను కడుపుబ్బా నవ్విస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మానందానికి అభిమానులున్నారు. ఆయన మీమ్సీ, టెంప్లెట్స్‌కి క్రేజ్ ఉంది. తాజాగా సిడ్నీ టెస్టు సందర్భంగా ఓ ఆస్ట్రేలియా జర్నలిస్టు బ్రహ్మానందం పిక్‌ను పోస్టు చేయడమే ఇందుకు ప్రత్యేక్ష ఉదాహరణ. 

‘సిడ్నీలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఓ సెట్ వర్షం కారణంగా కోల్పోయాం. ఆటకు వర్షం అడ్డంకి కలిగిందని చెప్పి నాకు వాతావరణ రిపోర్టు చెప్పిన స్నేహితుడి వైపు నేను ఇలా చూస్తున్నా...’ అంటూ బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌ను ట్వీట్ చేసింది ఆస్ట్రేలియా లేడీ జర్నలిస్ట్ చోలీ అమాండా బెయిలీ.

ఫన్నీగా ట్వీట్లు చేసే అమాండా, బ్రహ్మీ ఫోటో వాడడంతో తెలుగువారందరూ ఆమె ట్వీట్‌పై కామెంట్లు, లైకుల వర్షం కురిపించారు. అమాండా పోస్టులకి వచ్చే లైక్స్ కంటే బ్రహ్మీ పోస్టుకి కొన్ని వందల రెట్ల స్పందన రావడం విశేషం.