Asianet News TeluguAsianet News Telugu

The Ashes: ఇంగ్లాండ్ కు బాక్సింగ్ డే పంచ్ ఇచ్చిన ఆస్ట్రేలియా.. బోలాండ్ సూపర్ స్పెల్.. రూట్ సేనకు ఘోర పరాభావం

Australia Vs England: యాషెస్  సిరీస్ లో ఆసీస్ అదరగొట్టింది. బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్ కు భారీ పంచ్ ఇచ్చిన కంగారూలు.. మరో రెండు టెస్టులు మిగిలుండగానే యాషెస్ ను దక్కించుకున్నారు. 

Australia Won By an Innings and 14 Runs Against England and retain Ashes
Author
Hyderabad, First Published Dec 28, 2021, 11:10 AM IST

అనుకున్నదే అయింది. ఇంగ్లాండ్  కు బాక్సింగ్ డే పంచ్ గట్టిగా తగిలింది. యాషెస్ సిరీస్ రూట్ సేనకు దూరమైంది. సిరీస్ లో పడుతూ లేస్తూ వస్తున్న  ఇంగ్లీష్ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. కొత్త కంగారూ స్కాట్ బొలాండ్ దెబ్బకు క్రికెట్ పుట్టినిల్లు 68 పరుగులకే బ్యాగ్  సర్దేసింది. రెండున్నర రోజుల్లోనే ఇంగ్లాండ్ పనిపట్టిన ఆసీస్.. మరో రెండు టెస్టులు మిగిలుండగానే యాషెస్ (3-0తో) ను పట్టేసింది. నాలుగు ఓవర్లు వేసి ఏడు పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన ఆసీస్ యువ  పేసర్ స్కాట్ బొలాండ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

31 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద మూడో రోజు ఆట   ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ కోలుకోలేదు.  ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే  మిచెల్ స్టార్క్..  బెన్ స్టోక్స్ (11) ను పెవిలియన్ కు  పంపించి మూడో  రోజు ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికాడు. ఇక ఆ తర్వాత బంతి అందుకున్న బొలాండ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 

 

బొలాండ్ బంతులను ముట్టుకుంటే ఔట్ అవ్వడమే అన్నంతగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారంటే బొలాండ్ ఏ విధంగా చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. వరుసగా జో రూట్ (28),మార్క్ వుడ్ (0), ఓలీ రాబిన్సన్ (0), అండర్సన్ (2) ను ఔట్ చేశాడు. 31 పరుగులతో మూడో రోజు ప్రారంభించిన  ఇంగ్లాండ్.. మరో 37 పరుగులు మాత్రమే జోడించి క్లీన్ బౌల్డ్ అయింది.  దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో నిర్దేశించిన ఆధిక్యాని (82) కి కూడా ఇంగ్లాండ్ చేరలేకపోయింది. 68 రన్స్ కే ఆలౌట్ అయింది.  బొలాండ్ కు ఆరు వికెట్లు దక్కగా.. మిచెల్ స్టార్క్ కు 3 వికెట్లు దక్కాయి. 

బొలాండ్ అదుర్స్.. 

 

యాషెస్ సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మక మూడో టెస్టులో ఆసీస్ పేస్ దళం అదరగొట్టింది. ముఖ్యంగా స్కాట్ బొలాండ్  సంచలన స్పెల్ వేశాడు. నాలుగంటే నాలుగే ఓవర్లు వేసిన అతడు.. ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఓపెనర్ హసీబీ హమీద్, జో రూట్,  బెయిర్ స్టో, మార్క్ వుడ్ లు బొలాండ్ కే వికెట్ సమర్పించుకున్నారు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో అతడు వేసింది  24 బంతులే కావడం గమనార్హం. అందులో 7 పరుగులే ఇచ్చిన బొలాండ్.. ఏకంగా  ఆరు వికెట్టు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్  లో అతడికి ఒక వికెట్ దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios